సెల్ఫీ సరదా ఏమో కానీ సీఎంకు దెబ్బలు

Update: 2016-04-19 16:21 GMT
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఇప్పడంతా సెల్ఫీల హడావుడి నడుస్తున్న సంగతి తెలిసిందే. దేశాధినేతలు సైతం సెల్ఫీలు తీసుకుంటూ ముచ్చట తీర్చుకోవటం.. ప్రధాని మోడీ లాంటి వారు సెల్ఫీల్ని మరింతగా ప్రమోట్ చేయటంతో దేశంలో సెల్ఫీల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా సెల్ఫీ సరదా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రికి పెద్ద కష్టాన్నే తీసుకొచ్చాయి.

కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఈ రోజు షిఫ్పా ఆడిటోరియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో అక్కడున్న యువకులు సెల్ఫీ దిగేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మామూలు రోజుల్లో అయితే ఎలా ఉండేవారేమో  కానీ.. ఎన్నికల వేళ యూత్ ముచ్చట పడుతుంటే కాదనలేని ముఖ్యమంత్రి .. యూత్ సెల్ఫీకి ఓకే చెప్పారు.

తమతో సెల్ఫీకి ముఖ్యమంత్రి ఓకే చెప్పటంతో అక్కడున్న యువకుల్లో ఉత్సాహం ఒక్కసారి పొంగి పొర్లింది. సీఎంతో సెల్పీకి ఒక్కసారి ముందుకు తోసుకురావటంతో వారి పక్కనే ఉండే గ్లాస్ డోర్ పగిలింది. గాజు ముక్కలు ముఖ్యమంత్రికి గుచ్చుకున్నాయి. దీంతో స్పందించిన భద్రతా సిబ్బంది సీఎంను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సెల్ఫీ సరదా ముఖ్యమంత్రికి లేని పోని తలనొప్పులు తెచ్చిపెట్టింది.
Tags:    

Similar News