అర్థరాత్రి 1.30 వేళ ఆ అమ్మాయి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన ఆ సీఎం

Update: 2020-03-28 09:30 GMT
అర్థరాత్రి 1.30 గంటల వేళలో.. ముఖ్యమంత్రి ఇంటికి ఫోన్ చేస్తే.. సీఎం స్వయంగా కాల్ ఎత్తే అవకాశం ఉందా? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా.. నో ఛాన్స్ అనేస్తారు. కానీ.. ఆ పని చేశారో ముఖ్యమంత్రి. దానికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశమంతా లాక్ డౌన్ అయిన వేళ.. ఉద్యోగం చేస్తున్న ప్రాంతాల్లో ఉండలేక.. సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలన్న తొందర్లో కొందరు అమ్మాయిలు చేసిన ప్రమాదకర సాహసం.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందనతో ఇష్యూ సుఖాంతమైంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉండే ఈ ఉదంతంలో.. సీన్లోకి సీఎం ఎంటర్ కావటం సినిమాటిక్ గా అనిపించినా.. ఈ దేశంలో అలాంటి రియల్ హీరోలు ఉన్నారని చెప్పాలి. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్. 

హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో పని చేసే చాలామంది కేరళకు చెందిన పదమూడు మంది అమ్మాయిలు కలిసి.. ఒక ప్రైవేటు టెంపోను మాట్లాడుకున్నారు. తమ స్వస్థలమైన కేరళ లోని కోజి కోడ్ దగ్గర దింపి రావాలన్నది డీల్. పోలీసుల వద్ద అనుమతి పత్రాలు తీసుకొని వారంతా బయలుదేరారు. ఇదంతా హాస్టల్స్ మూసివేస్తామంటూ యజమానులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సొంతూళ్లకు బయలుదేరిన వేలాది మందిలో వారు కూడా ఒకరు.

హైదరాబాద్ ను దాటిన వారి ప్రయాణం.. కర్ణాటక - కేరళ సరిహద్దుల్లోకి వెళ్లేసరికి ఆ టెంపో డ్రైవర్ కు ఒక అనుమానం వచ్చేసింది. తాను కేరళకు వెళ్లిన తర్వాత.. తనను తిరిగి పంపనంటే తన పరిస్థితి ఏమిటి? నాలుగు డబ్బుల కోసం కక్కుర్తి పడితే.. మొదటికే మోసం వస్తుంది కదా? అన్న సందేహం అతడ్ని భయంలోకి తీసుకెళ్లింది. అంతే.. తాను అంతకు మించి ముందుకు రాలేనని చెప్పి.. కేరళ బోర్డర్ అయిన ముతంగ దగ్గర దింపాడు. కనీసం తొల్పెట్టి వరకు రావాలంటే.. అలా వస్తే తనకు ఎదురయ్యే ఇబ్బందిని చెప్పి.. ఆ అమ్మాయిల్ని బతిమిలాడుకొని వెళ్లిపోయాడు.

వారు దిగిన ప్రాంతం ఒకరకంగా అటవీ ప్రాంతం. అప్పటికే ఆ అమ్మాయిలు తమ వారితో టచ్ లో ఉంటూ.. తాము ఎక్కడి వరకూ వచ్చింది అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. వారు కూడా తమకున్న పరిచయస్తులకు ఫోన్లు చేస్తూ.. తమ వారిని సేఫ్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివేళ.. టీసీఎస్ లో పని చేసే ఒక అమ్మాయి (అథీరా) సాహసమే చేసింది. ముఖ్యమంత్రి విజయన్ ఇంటి ఫోన్ నెంబరు సంపాదించి.. ఆయనకు ఫోన్ చేసింది.

అర్థరాత్రి ఒంటిగంటన్నర వేళలో.. సీఎం నివాసానికి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడతారా? నో ఛాన్స్. చీకట్లో రాయి వేసింది. కొన్నిసార్లు అలాంటి రాళ్లు తగలాల్సిన చోటే తగులుతాయి. ఆ అమ్మాయి ఫోన్ కు స్వయంగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఫోన్ ఎత్తారు. తమ పరిస్థితిని ఏకరువు పెట్టింది. ఫర్లేదమ్మా.. నేనిప్పుడే జిల్లా కలెక్టర్.. ఎస్పీలకు సమాచారం ఇస్తాను. వారి నెంబర్లు తీసుకోండని ఆయనే స్వయంగా ఇచ్చారు. ఫోన్ కాల్ అయ్యాక.. తాను మాట్లాడింది నిజమేనా? అని ఆ అమ్మాయే ఆశ్చర్యపోయే పరిస్థితి.

తనకు ఇచ్చిన నెంబర్లలో కలెక్టర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎస్పీకి చేస్తే స్పందించటమే కాదు.. వెంటనే ఫోర్సును పంపిస్తామని చెప్పి.. వారిని రెస్య్కూ చేశారు. వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారు. పదమూడు మంది తెల్లారేసరికి ఇళ్లల్లో ఉన్నారు. క్వారంటైన్ సెంటర్లకు కాదు. అలా పదమూడు మంది కేరళ అమ్మాయిల సాహసం సుఖాంతమైంది. ఏమైనా.. కేరళ ముఖ్యమంత్రి గొప్పోడు కదా? 
Tags:    

Similar News