కేరళ గోల్డ్ స్కామ్ : ఎన్నికల వేళ బాంబ్ పేల్చిన స్వప్న సురేశ్ ... చిక్కుల్లో సీఎం పినరయ్ !
అతి త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు భారీ షాక్ తగిలింది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ముఖ్యమంత్రి పినిరయి విజయన్ కు చాలా సన్నిహిత సంబంధం ఉందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ కూడా తన దర్యాప్తులో వెల్లడించారు. ఈ స్మగ్లింగ్ లో సీఎం పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులకు చెప్పారు. సీఎంతో పాటు మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. ముగ్గురు మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఇందులో పాత్రధారి అంటూ ఆమె వెల్లడించారు.
సీఎం విజయన్ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్ కు, సీఎం విజయన్ కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్ గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు కు కూడా వెల్లడించారు. జులై 5న త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ కు దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్ కు ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్వప్న సురేశ్ ను కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలొచ్చాయి.
ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్ చెన్నితాలా మాట్లాడుతూ.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నించారు. జాతీయ భద్రతా సంస్థ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ లు విడివిడిగా కేసును దర్యాప్తు చేస్తున్నాయి.