ఆ మాజీ సీఎంకు రెండు బ్యాడ్ న్యూస్‌ లు

Update: 2016-12-23 08:20 GMT
కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ ఒకేరోజు రెండు దుర్వార్త‌లు వినాల్సివ‌చ్చింది. యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో తమ సమీప బందువులను కీలక స్థానాల్లో నియమించడంపై దాఖలపై పిటిషన్ స్వీక‌రించిన త్రివేండ్రం విజిలెన్స్ కోర్టు విచారణకు ఆదేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఉమెన్ చాందీతో పాటు తొమ్మిది మంది యూడీఎఫ్ నాయకులపై ప్రాథమిక విచారణకు కోర్టు అనుమతినిచ్చింది. ఉమెన్ చాందీ ఇప్పటికే సోలార్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

స‌రిగా అదే స‌మ‌యంలో సోలార్ స్కాం కేసు విచారణ నిమిత్తం సోలార్ జూడిషియల్ కమిషన్ ముందు ఉమెన్ చాందీ  హాజరయ్యారు. సోలార్ స్కాంలో బీజూ రాధాకృష్ణన్ - సరితా ఎస్ నాయర్‌ లు దోషులుగా తేలారు. వీరిద్దరికి పెరుంబుదూర్‌ లో గల జూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 వేలను జరిమానాగా విధించింది. కాగా సోలార్ ప్రాజెక్టును దక్కించుకునే క్రమంలో రూ. కోటికి పైగా అప్పటి సీఎం చాందీకి చెల్లింపులు చేసినట్లు దోషుల్లో ఒకరైన సరిత ఆరోపించింది. విచారణ నిమిత్తం రాష్ట్ర సీఎం జూడిషియల్ కమిషన్ ఎదుట హాజరుకావడం కేరళ చరిత్రలో ఇదే తొలిసారి. ఇలా ఒకే రోజు రెండు దుర్వార్త‌ల‌తో చాందీ వార్త‌ల్లో నిలిచారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News