తాత ముత్తాతల నుంచి వ్యాపారం చేస్తున్నామని.. తమకు ఆర్థిక కష్టాలన్నవి లేవంటూ కోతలు కోసేసిన విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మాటలు గుర్తున్నాయా? అయితే.. ఆ మాటల్ని కాసేపు అలానే గుర్తుంచుకొని.. ఈ వార్తను చదవండి. ఎంపీగా అసలు రూపం తెలియటమే కాదు.. ఆయన మాటలకు చేతలకు మధ్యనున్న వ్యత్యాసం ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్థమైపోతుంది.
చెప్పా పెట్టకుండా..ముందస్తుగా ఎలాంటి ప్రకటన లేకుండానే హటాత్తుగా కేశినేని ట్రావెల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. తనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయని.. అందుకే తాను ట్రావెల్స్ ను నిలిపివేసినట్లుగా కేశినేని నాని చెప్పారు. మరి.. ప్రభుత్వాలతో ఇబ్బందులు ఉన్నప్పుడు వ్యాపారం మూసేస్తే.. ఏడాది నుంచి ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వనట్లు? అన్నది ప్రశ్న. దీనికి తగ్గట్లే కేశినేని నాని ఉద్యోగులు తమకు జీతాలు ఇవ్వాలంటూ రోడ్ల మీదకు ఎక్కారు. ఏడాదిగా తమకు జీతాలు ఇవ్వటం లేదని ట్రావెల్స్ సిబ్బంది తాజాగా మరోసారి రోడ్లెక్కారు.
తమకు కనీసం ప్రత్యామ్నయ ఉపాధి చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే ట్రావెల్స్ ను మూసేసి.. తమను రోడ్డు మీద పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విజయవాడలో ఆందోళన చేపట్టిన బాధితులు.. ఎంపీ స్థాయి వ్యక్తి తమకు జీతాలు ఎగ్గొడతారని అస్సలు ఊహించలేదన్నారు. ఆందోళన చేస్తున్న తమపై కేశినేని అనుచరులు దురుసుగా వ్యవహరిస్తున్నారని.. ఎవరికి చెప్పుకుంటారో వారికి చెప్పుకోడండంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా తనకున్న సత్తా గురించి ఈ మధ్యనే మీడియాతో చెప్పిన కేశినేని తాజాగా ఆందోళన చేస్తున్న తన ఉద్యోగుల మాటల్ని ఏమంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/