తిరుపతి సభ వేదికగా ఏపీ ఎంపీలపై నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కు ప్రశంసలు - విమర్శలూ రెండూ దక్కాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. తొలుత ఆచితూచి స్పందించినా ఆ తరువాత తమ అధినేత స్పందన చూశాక స్పీడు పెంచారు. పవన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే తన పేరు తలచుకోకుండా పవన్ ఉండలేరని అంటున్నారు. పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తన పేరు పలక్కుండా ఉండరని ఆయన అన్నారు.
హిందీ - ఇంగ్లీష్ రాని మన ఎంపీలు పార్లమెంటులో తెలుగులో మాట్లాడుతున్నారని, ప్రధానిని ‘సార్ సార్’ అని సంబోధిస్తూ రాష్ట్రానికి హోదాను గట్టిగా డిమాండ్ చేయడంలో విఫలమవుతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. పెద్దలను గౌరవించడం సంప్రదాయం కాబట్టి ప్రధానిని సార్ అని సంబోధిస్తున్నానని, తెలుగు ప్రజలకు అర్థం కావాలనే తెలుగులో మాట్లాడుతున్నానని.. తనకు హిందీ - ఇంగ్లిష్ కూడా వచ్చని నాని అన్నారు. పవన్ ఎప్పుడూ తన పేరు తలస్తూ ప్రజలకు తన పేరు గుర్తు చేస్తుంటారని అన్నారు.
ప్రత్యేక హోదాను సాధించే వ్యూహం పవన్ వద్ద ఉంటే దాన్ని వెంటనే బయటపెట్టాలని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హోదాపై పోరాటం అంటే రాష్ట్రంలో ధర్నాలు - రాస్తారోకోలు కాదని - పవన్ ఢిల్లీ వెళ్లి మోడీ ఇంటి ముందు సభ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించుకుందని, ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని అన్నారు. మొత్తానికి మొన్న పవన్ తో కలిసి పనిచేస్తామని చెప్పిన నానియే ఇప్పుడు పవన్ పై ఫైర్ అవుతుండడం వెనుక కారణమేంటో?