తెలుగు తమ్ముళ్లకు పెద్ద పరీక్షగా మారారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఎన్నికల్లో గెలుపు నాదే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేదే మేమే అంటూ ఆశలు పెట్టుకుంటే.. అందుకు భిన్నంగా ఓటర్లు 23 సీట్లు చేతికిచ్చి దిమ్మ తిరిగి పోయేలా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా బయటకు రాలేదు. మరోవైపు ప్రత్యర్థులపై సంధించాల్సిన ట్వీట్ అస్త్రాల్ని సొంతోళ్ల మీద ప్రయోగిస్తున్న నాని తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
సున్నితంగా చెప్పినా.. కరకుగా చెప్పినా కేశినేని వారి తీరు మారకపోవటంపై ఏం చేయాలో అర్థం కావట్లేదట. ఇదిలా కాదంటూ నానిని కంట్రోల్ చేసేందుకు బుద్ధా వెంకన్న రంగంలోకి దిగటంతో ఇష్యూ మరింత రచ్చ కావటం ఒక ఎత్తు అయితే.. అధినేత కల్పించుకోవాల్సి వచ్చింది. బాబే నేరుగా లైన్లోకి రావటంతో.. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై ఒక్క ట్వీట్ చేయనంటూ బుద్ధా వెంకన్న బుద్దిమంతుడయ్యాడు.
దీంతో.. ఇష్యూ క్లోజ్ అయినట్లేనని సంతోషపడిన తమ్ముళ్లకు నాని షాకులిచ్చేలా ట్వీట్లు చేయటం షురూ చేశారు. దీంతో.. ఆయన్ను ఎలా కంట్రోల్ చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అసలు ఏ ప్రయోజనం కోసం నాని ట్వీట్లు చేస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే.. సుజనా.. సీఎం రమేశ్.. టీజీల మాదిరి వెళ్లిపోవచ్చు కదా? అలా కాకుండా పార్టీలో ఉండి ట్వీట్లతో పలుచన చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్న తమ్ముళ్లకు సమాధానాలు దొరకట్లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగితే మరింత మెరుగైన మెజార్టీ వచ్చేదన్న మాటపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు అధినేతకు అండగా ఉండాల్సింది పోయి ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంలో అర్థముందా? అని టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ తరఫు పోటీ చేయటం కారణంగా మెజార్టీ తగ్గిందన్నది నాని ఉద్దేశం అయితే.. పార్టీ కారణంగా వచ్చిన పదవికి రాజీనామా చేసి.. సొంతంగా పోటీ చేయొచ్చుగా? అన్న క్వశ్చన్ వారి నోటి నుంచి వస్తోంది. పార్టీలోనే ఉంటూ పార్టీ పరువు తీస్తున్న కేశినేని నాని సాఫ్ట్ వేర్ వెర్షన్ ఒక పట్టాన అర్థం కావట్లేదన్న మాట వినిపిస్తోంది. నాని సాఫ్ట్ వేర్ ను క్రాక్ చేయటం ఎలా అన్నది తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు పెద్ద పరీక్షగా మారిందట.