తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి విజయవాడ ఎంపీ కేశినేని నాని. రవాణ శాఖ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరు, అనంతరం తన సంస్థను అర్ధాంతరంగా మూసివేసిన వైనం అందరి చూపును నాని వైపు తిప్పుకొనేలా చేసింది. ఈ పరిణామాలు సహా అనేక రాజకీయ అంశాలపై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశినేని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతోందని, అయితే తాను వేరే పార్టీలో చేరే అవకాశం లేదని కేశినేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రజారాజ్యం పార్టీ తదుపరి రాజకీయాలకు దూరంగా ఉండాలని తాను భావించానని ఈ క్రమంలో తనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రోత్సహించారని కేశినేని నాని తెలిపారు. తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా కీలక స్థానం నుంచి బరిలోకి దింపారని గుర్తుచేసుకున్నారు. అంతటి ప్రాధాన్యం దక్కిన పార్టీకి తాను దూరం కాబోనని తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే, నువ్వొద్దు పోరా అంటే.... రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంత వ్యాపారం చేసుకుంటానే తప్ప మరో పార్టీలో చేరబోనని కేశినేని నాని స్పష్టం చేశారు. రవాణశాఖ అధికారులతో వివాదం ఉదంతంలో తన తప్పేం లేదని నాని కితాబు ఇచ్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు విషయంలో పత్రాలు అడిగే సరైన రీతిలో అధికారులు స్పందించలేదన్నారు.
ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని తీరు సరిగా లేదని నాని విమర్శించారు. ఆరంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి రాయలసీమలోని కడప నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి, ఆ తర్వాత నిజామాబాద్‌కు వలస వెళ్లాడని ప్రచారం జరుగుతుందని నాని తెలిపారు. తెలంగాణలో ఉన్న సమయంలో ఎంపీ కవిత మనిషినని, ఏపీలో ఉన్న సమయంలో ఇంకో పార్టీ పేరును ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత వాడుకుంటాడని కేశినేని నాని ఆరోపించారు. ఈసారి నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తాడని కూడా అంటున్నారని నాని వివరించారు. ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సుల్లో కొత్తగా చేరినవి అరుణాచల్ ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ అయినవని నాని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని జగన్ కలలు కంటున్నారని కేశినేని నాని ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/