పరాజయం షాక్ నుంచి ఇంకా కోలుకోని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని రీతిలో షాకిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. పార్టీ పార్లమెంటరీ విప్ పదవిని ఆయన రిజెక్ట్ చేస్తూ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీ అధినేత బాబుతో నిన్న టీడీపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోక్ సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్.. పార్టీ విప్ గా కేశినేని నానిని.. రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా సీఎం రమేశ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. బాబు పదవి ఇచ్చి 24 గంటలు తిరగకముందే.. తాజాగా కేశినేని నాని షాకింగ్ పోస్ట్ ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. పార్టీ అధినేత ఇచ్చిన పోస్ట్ ను తాను స్వీకరించలేనని స్పష్టం చేశారు.
తననకు ఎన్నుకున్న విజయవాడ ప్రజలకు మరింత సేవ చేసే పనిలో భాగంగా తాను పార్టీ ఇచ్చిన పదవిని చేపట్టలేనని.. తనకంటే సమర్థులకు ఆ పదవిని అప్పజెప్పాలని ఆయన కోరారు. దీనిపై పార్టీ స్పందించాల్సి ఉంది. ఇటీవల కాలంలో కేశినేని నాని బీజేపీలోకి వెళ్లిపోయే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా ఆయన పదవిని రిజెక్ట్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన వేళ.. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు పలువురు బీజేపీలోకి చేరాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని నాని కలవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా పదవి ఇచ్చిన వెంటనే తాను చేపట్టలేనంటూ తిరస్కరించటం చూస్తుంటే.. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి షాకులు బాబుకు మరెన్ని తగులుతాయో ఏమో?