రోజులు మారాయి. రాజకీయ నేతలు విమర్శించే తీరు మారింది. కానీ.. వారి మాటల్లో రచ్చ మాత్రం మారలేదు. గతంలో వ్యక్తిగతంగా పడకున్నా.. రాజకీయంగా వైరం ఉంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటానికి ప్రెస్ మీట్లు పెట్టేసేవారు. లేదంటే.. చానల్ గొట్టాల ముందు తాము చెప్పాల్సింది చెప్పేసేవారు. ఇప్పుడు కాలం మారింది. ఎవరి మీద ఎప్పుడు కోపం వచ్చినా.. వారెక్కడున్నా సరే.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టేస్తే చాలు.. జరగాల్సిందంతా జరిగిపోయే పరిస్థితి. గడిచిన కొద్దిరోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చెలరేగిపోతున్న వైనం తెలిసిందే.
సొంతోళ్లు.. ప్రత్యర్థులు అన్న తేడా లేకుండా ఎవరి చొక్కాలైనా విప్పేసేలా ట్వీట్లు చేయటంలో బాగా ఆరితేరిపోయారు. కేశినేని దూకుడుకు కళ్లెం వేయాలని ప్రయత్నించిన బుద్దా వెంకన్న కాస్త ప్రయత్నం చేసినా.. బాబు జోక్యంతో.. బబ్బాబు తప్పైంది.. నేనెప్పటికి మాట్లాడనంటూ కామ్ అయ్యారు. అయినప్పటికీ కేశినేని నాని తగ్గని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ.. విజయవాడ ఎంపీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. స్వల్ప తేడాతో ఓడిన పీవీపీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రావటంతోనే కేశినేని నానితో పాటు.. తమ్ముళ్లకు సెగ పుట్టేలా ట్వీట్లు దంచేస్తున్నారు.
దీంతో.. రోజుల వ్యవధిలోనే నాని వర్సెస్ పీవీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఇప్పటివరకూ చొక్కాలు విప్పేసే టాలెంట్ ఉన్న నానికి మించి నాలుగు ఆకులు చదివినట్లుగా ట్వీట్లు చేస్తున్న పీవీపీ ఇప్పుడు ఏకంగా నిక్కర్ల వరకూ వెళ్లిపోయారు. తాజాగా వీరిద్దరి ట్వీట్లు చూస్తే.. రానున్న రోజుల్లో వీరి వ్యవహరం మరెందగా ముదిరిపోతుందోనన్న సందేహం రాక మానదు.
డబ్బులు ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశినేని.. తాజాగా ట్వీట్ చేస్తూ.. తాను ఎవరికైనా ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని.. ఇదే విషయాన్ని ఇప్పటికే వందలసార్లు చెప్పినట్లుగా పేర్కొన్నారు. అక్కడితో ఆగని నాని.. పీవీపీకి కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా.. ఆయన బ్యాంకులకు కట్టాల్సిన వేల కోట్లు కట్టేస్తే దేశానికి మంచి చేసినోడివి అవుతానంటూ మంట పుట్టే ట్వీట్ చేశారు.
నాని నుంచి ఇంత మాట వచ్చాక పీవీపీ ఊరికే ఉంటారా? అందుకే.. చెలరేగిపోయేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరంగా మారిన ఆ మాటల్ని చూస్తే.. "ముందు నీది పసుపు నిక్కరో.. ఖాకీ నిక్కరో తేల్చుకోవయ్యా సామి! సక్రమ సంబంధమో లేక అక్రమ సంబంధమో ప్రజలే తేలుస్తారు. అటు ఇటు కానోళ్లని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెబుతారు. బై ద వే.. ప్రతిసారి కొత్త నిక్కర్ కుట్టించాలన్నా.. మీటర్లు మీటర్లు గుడ్డ అవసరమాయే! అసలే కరువు కాలం.." అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారు. తన మాటలతో మంట పుట్టించే నానికి.. భారీ పంచ్ ఇచ్చిన పీవీపీకి ఎలాంటి బదులిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.