సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ.. ఎంతో మంది నాయకులు.. సీనియర్లకు కొదవే లేదు.. అలాంటి అతిపెద్ద పార్టీలో కుర్చీ కోసం కుమ్ములాటలు మొదటి నుంచి ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఒక్కతాటిపై ఉంది. ఆయన నాయకత్వంలో నాయకులందరూ నాయనో , భయానో ఐకమత్యంగా కలిసి పనిచేశారు. హైదరాబాద్ కు చెందిన సీనియర్ నేత పీజేఆర్ మాత్రమే వైఎస్ ను విభేదించేవారు. కానీ ఆ తర్వాత ఆయన కూడా వైఎస్ తో సఖ్యతతో ముందుకెల్లారు.. వైఎస్ మరణించాకే కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది.. కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే వారు లేకపోవడంతో గందరగోళం నెలకొంది. వైఎస్ మరణించాక.. రోశయ్య సీఎం కావడం.. ఆయన వల్ల కాకపోవడంతో తర్వాతి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణ ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ ఎస్ ప్రభుత్వంపై పోరాడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
1.ఉత్తమ్ కుమార్ రెడ్డి..
పీసీసీ చీఫ్ గా తెలంగాణ సీఎం రేసులో మొదటి స్థానంలో ఉన్నది ఉత్తమే.. ఈయనకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. ఒక వేళ అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పరిశీలించే మొదటి పేరు ఉత్తమే.. ఆర్థిక బలం పుష్కలంగా ఉండడం.. రెడ్డి సామాజికవర్గం కావడం ఉత్తమ్ కు కలిసివచ్చే అంశాలు.. గడిచిన ఎన్నికల్లో ఉత్తమ్ గెలవడంతోపాటు ఆయన భార్యను ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగారు.. పార్టీని ఒక్కతాటిపై నిలబెట్టలేకపోవడమే ఉత్తమ్ కు ఉన్న మైనస్ గా చెప్పవచ్చు.. వైఎస్ స్థాయిలో ఉత్తమ్ కు ప్రజల్లో చరిష్మా లేకపోవడమే ప్రధాన లోపంగా చెప్పవచ్చు..
2.జానారెడ్డి
తెలంగాణలోని సీనియర్ రాజకీయ వేత్తగా జానారెడ్డికి పేరుంది. నాటి ఎన్టీఆర్ హయాం నుంచే మంత్రిగా సేవలందించిన అనుభవం ఉంది. కానీ జానారెడ్డికి ప్రధానంగా ఉన్న లోపం నాయకును ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం లేకపోవడమే.. ఇప్పటికి జీనారెడ్డి మాటలు , వ్యవహారశైలి కాంగ్రెస్ లోని తోటి ఎమ్మెల్యేలకు అర్థం కావు.. అప్పుడప్పుడు ఆయన అధికారపక్షాన్ని పొగడుతూ సొంత పార్టీని తిడుతుంటారు. జానారెడ్డి లోని ఈ చాదస్త వైఖరిపై సెటైర్లు ఎన్నో ఉన్నాయి. ఎంత సీనియర్ అయినా కానీ ఆయనకు సీఎం పీఠం దక్కకపోవడానికి ప్రధాన కారణం ఆయన వ్యవహారశైలియే అంటారు కాంగ్రెస్ లోని పెద్దలు..
3.భట్టి విక్రమార్క
టీపీసీసీలో ఉత్తమ్ తర్వాత అత్యంత చురుకైన.. ప్రజాసమస్యలపై పోరాటం చేయగల నేత మల్లు భట్టి విక్రమార్కనే.. ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఖమ్మం జిల్లా మధర శాసనసభ ఎమ్మెల్యేగా భట్టి మంచి పేరు సంపాదించారు. అధికార పక్షాన్ని భట్టి చాలా సార్లు ఇరుకునపెట్టారు. భట్టి ప్రజాసమస్యలపై సంధించే ప్రశ్నలు, పోరాటాలు ఆయనలోని నాయకత్వ శైలికి అద్ధం పడతాయి.. రైతుల విషయంలో భట్టి పోరాటం చాలా సార్లు ఢిల్లీ పెద్దలను కూడా ఆకట్టుకుంది. కాంగ్రెస్ కనుక అగ్ర సామాజికవర్గాలను కాదనుకుంటే భట్టి మంచి ప్రత్యామ్మాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు..
4. కోమటిరెడ్డి
కోమటిరెడ్డి కి కాంగ్రెస్ లో చాలా పట్టు ఉంది. నల్గొండ రాజకీయాల్లో ఆయన ముద్ర ఆపారం.. అపార ప్రజాబలం ఉన్న కోమటిరెడ్డి ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. వైఎస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టు కాంట్రాక్టులు పట్టి.. ఇప్పటికీ కాంట్రాక్టర్ గా రాణిస్తున్నారు. ఆర్థిక బలం ఉండడంతో రాజకీయాల్లోనూ ఆరితేరారు. ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ ప్రజల్లో అభిమానం చూరగొన్నారు. ఇటు ప్రజల్లో బలం.. అటు ఆర్థికంగా బలం గా ఉన్న కోమటిరెడ్డికి పార్టీని లీడ్ చేసే అవకాశమే రావడం లేదు.. వచ్చినా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా సీఎం పోటీలో వెనుకబడుతున్నారు.
5. రేవంత్ రెడ్డి..
ఇక చివరగా ఈ మద్యే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోరాడి సీఎం అవుదామని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు ఆయనను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఇటు పార్టీలో, ఆ పదవుల్లో ఆయనకు దక్కకుండా ప్లాన్లు చేస్తున్నారు. దీంతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ను లీడ్ చేద్దామని వచ్చిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఇమడలేక సతమవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్లు ఆయన సీఎం ఆశలను చెరిపేస్తున్నారు. మంచి వాగ్దాటి, పోరాడే శక్తి నాయకత్వ లక్షణాలున్నా రేవంత్ సీఎం కాకుండా అడ్డుకుంటున్నది ఆ పార్టీలోని సీనియర్లే కావడం గమనార్హం.
6.డీకే అరుణ
గద్వాల అరుణక్కగా పేరుగాంచిన డీకే అరుణ కు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. తన దూకుడు స్వభావంతో ఈమె ప్రతిపక్షాలను గడగడలాడిస్తుంటుంది.. చాలా సార్లు తనకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పాలని అధిష్టానాన్ని కోరినా ఈమెకు ఆ చాన్స్ దక్కలేదు. బలమైన రెడ్డి సామాజికవర్గం కావడం.. ఆర్థిక వనరులున్నా కూడా ఉత్తమ్, జానాలాంటి సీనియర్ల ముందు డీకే అరుణ వెలుగులోకి రాలేదు.. వెనుకబడిన మహబూబ్ నగర్ రాజకీయాల్లో ధీర మహిళా ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన డీకే అరుణకు ఆ దుందుడుకు స్వభావమే కాస్త మైనస్ గా చెప్పవచ్చు. ఆమె ప్రతిపక్షాలపై విరుచుకుపడే తీరు ఆకట్టుకుంటున్నా పార్టీలో కూడా అదే రీతిలో ఉండడం ప్రధానలోపంగా చెప్పవచ్చు. డీకే అరుణ నాయకత్వాన్ని కాంగ్రెస్ లోనే కొంత మంది అగ్రనాయకులు వ్యతిరేకిస్తుండడంతో సీఎం రేసులో డీకే వెనుకే ఉన్నారు.
ఈ ఆరుగురే కాకుండా ఇంకా చాల మంది రేస్ లో ఉన్నారు .. రేణుకా చౌదరి, శశి ధర్ రెడ్డి ఇలా చెప్పుకుంటు పోతే చాల మంది ఉన్నారు . ఇందులో ఎవరికీ వారే చాన్సులున్నాయి.. వీరి మధ్యన పోటీ ఉంది. ఒకవేళ వచ్చేసారి అధికారంలోకి వస్తే అధిష్టానం దృష్టిలో వీరందరూ ముందుంటారు.. వీరిలో ఒకరు సీఎం అవ్వడం ఖాయం.. కానీ ఇదంతా జరగాలంటే వచ్చే 2019 ఎన్నికల్లో కేసీఆర్ ను తట్టుకొని గెలిస్తేనే.. చూద్దాం అప్పటివరకు ఈ నేతలంతా కలిసి కాపురం చేస్తారా లేదా.? కొట్టుకొని విడిపోతారా..