ఉత్తర కొరియాలో కిమ్ సోదరికి కీలక బాధ్యతలు

Update: 2021-10-01 02:30 GMT
ఊహించని నిర్ణయాలు.. కఠోర శిక్షలు అమలు చేసే ఉత్తర కొరియా గురించి నిత్యం ప్రపంచం మాట్లాడుకుంటుంది. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే ఉత్తరకొరియా దేశానిది భిన్నమైన పాలన. అక్కడి ప్రస్తుత అధ్యక్షుడు చెప్పిందే వేదం.. చేసేదే చట్టం.. అన్నట్లుగా సాగుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు భయంకరంగా ఉంటాయి. మిగతా విషయాలకంటే క్షిపణి ప్రయోగాలపై ఎక్కువగా దృష్టిపెట్టే  అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ త్వరలో తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారు.  తన సోదరి కిమ్ యో జోంగ్ కు దేశ వ్యవహారాల కమిషన్ సభ్యురాలిగా ఎన్నుకున్నారు.  ఇప్పటి వరకు అన్న కిమ్ జోన్ ఉంగ్ కు సలహాదారురాలిగా ఉన్న కిమ్ యో జోంగ్ ఇక నుంచి నార్త్ కొరియాకు తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా ఉండనున్నారు

నార్త్ కొరియాలో ఇటీవల సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ జోన్ ఉంగ్ నేతృత్వంలో తన సోదరి కిమ్ యో జోంగ్ ను  దేశ వ్యవహారాల కమిషన్ సభ్యురాలిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్నారు. దీంతో కిమ్ యో జోంగ్ ఇక దేశ పాలనపై తనదైన ముద్ర పడనుంది. దేశంలో ప్రస్తుతం సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలో కిమ్ యో జోంగ్ నియామకం అవసరమని గుర్తించిన దేశాధ్యక్షుడు తన సోదరి ఉండేలా చూసుకున్నారు. అయితే కిమ్ యో జోంగ్ ఇప్పటికే వర్కర్స్ పార్టీ సీనియర్ నేతగా దక్షిణ కొరియాతో సంబంధాలు పర్యవేక్షిస్తున్నారు. తాజా నియామకంతో అమెకు అదనపు బాధ్యతను అప్పగించినట్లయింది.

అసెంబ్లీ సమావేశాల్లో కిమ్ యో జోంగ్ తో పాటు మరో ఏడుగురికి కూడా నియమించారు. వీరంతా ఆమెకు సహాయం చేస్తారు. ఈ మేరకు గురువారం వీరి నియామకానికి సంబంధించిన జాబితాను ప్రకటించారు. అయితే వీరందరిలో కిమ్ యో జోంగ్ మాత్రమే చిన్న వయస్కురాలు. దేశ వ్యవహారాల కమిషన్ లో ఇంతకుముందు 9 మంది సభ్యులున్నారు. వారందరినీ అర్ధాంతరంగా తొలగించారు. వారిలో వైస్ ప్రెసిడెంట్, కిమ్ జోన్ ఉంగ్ కు వ్యక్తిగత సలహాదారుడిగా ఉన్న పాక్  జు, అమెరికాతో దౌత్య సంబంధాలు ఏర్పరిచిన చోయి సన్ హుయి ఉన్నారు.

కిమ్ యో జొంగ్ వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఆమె అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా నాయకుడు మూన్ జే ఇన్ తో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించిన సమావేశాల్లో కీలకంగా ఉండేవారు. ఆమె రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్య కారణాలతో చాలా రోజులు బయటకు రాలేదు. దీంతో కిమ్ యో జోంగ్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతుందని ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అయినా పరోక్షంగా ఆమె అధ్యక్షురాలిగానే వ్యవహరించారు.

ప్రపంచంలో భయంకర అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ ఉన్  ను పేర్కొంటారు. కానీ ఆయన సోదరి కిమ్ యో జోంగ్ అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి అని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ విషయాల్లో కీలక ప్రకటనలు చేస్తూ ఆమె ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై కామెంట్స్ చేయడం.. సోదరుడు చేస్తున్ క్షిపణి ప్రయోగాలను సమర్థించుకోవడం, ఇతర దేశాలపై సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాను తనవైపు తిప్పుకుంటోంది. కిమ్ యో జోంగ్ నియామకంపై ఇతర దేశాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధం తగ్గాలంతో ముందుగా అమెరికా, దక్షిణ కొరియాలు తమ దేశంపై అనుసరిస్తున్న విధానాలను నిలిపివేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News