ప్రోటెం స్పీకర్ సీనియారిటీ..?

Update: 2018-05-18 15:43 GMT
కర్ణాటక అసెంబ్లీ రేపు యడ్యూరప్ప బలం నిరూపించుకోవాల్సిన సమయంలో ప్రోటెం స్పీకర్‌గా బీజేపీకే చెందిన ఎమ్మెల్యే బొపయ్యను నియమించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై  జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జేడీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని బోపయ్యను ఎలా నియమిస్తారంటూ తమ పిటిషన్ లో ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దేశ్ పాండే ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేశ్ పాండేను కాదని బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.
    
ఈ నేపథ్యంలో ప్రోటెం స్పీకర్ నియామకం అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రోటెం స్పీకర్ నియామక విధివిధానాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేనే ప్రోటెం స్పీకర్‌ గా నియమించాలంటూ జేడీఎస్ కోర్టుకు వెళ్లినప్పటికీ.. అదేమీ రాజ్యాంగంలో రాసి లేదని.. కేవలం సంప్రదాయం మాత్రమేనని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
    
రాష్ట్రాల సంగతి పక్కనపెడితే లోక్ సభలో మాత్రం ఇదే సంప్రదాయం ఇంతవరకు కొనసాగుతూ వస్తోంది. 16వ లోక్ సభలో కూడా బీజేపీ మెజార్టీ సాధించినా ప్రోటెం స్పీకరుగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ సభ్యుడు కమల్ నాథ్‌ ను నియమించారు. లోక్ సభలో చూసుకుంటే 2చ3 - 4 - 5 సభలకు గోవింద్ దాస్ ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించారు. ఆ తరువాత వామపక్ష నేత ఇంద్రిజిత్ గుప్తా 10 - 11 - 12 - 13 లోక్ సభల్లో ప్రోటెం స్పీకరుగా వ్యవహరించి గోవింద్ దాస్ రికార్డు సమం చేశారు.
Tags:    

Similar News