అందరిలో ఒకడిగా..ఐదుసార్లు గెలిచిన ఎమ్మెల్యే

Update: 2020-02-08 09:01 GMT
ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి ప్రభుత్వ ప్రతినిధి. ప్రజల ఓట్లతో గెలిచి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తుంది. వాహనం - ఇల్లు - భద్రత - జీతం - భత్యం తదితర ఎన్నో ప్రభుత్వం కేటాయిస్తుంది. దీంతో ఆ ఎమ్మెల్యే బందోబస్తు - మందీమార్బలంతో హల్ చల్ చేస్తాడు. ఆ విధంగా ఎమ్మెల్యేలు ప్రజలకు సేవకులుగా కాకుండా దర్పం కనబరుస్తూ ఓటేసిన వారికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారినే మనం చూస్తున్నాం. అయితే మాజీ ఎమ్మెల్యేలు కూడా వీరికి సమానంగా జీవిస్తున్నారు. వీరికి భిన్నంగా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్టీసీ బస్సు - ఆటోలో ప్రయాణించడం - ఖద్దరు దుస్తులు కాకుండా సాధారణ పంచె - ఓ చొక్కా - చేతిలో తువ్వాలు ధరించి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఆయనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన గుమ్మడి నర్సయ్య. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. లేకున్నా ఆయన సాదాసీదా జీవితం గడుపుతున్నారు. ప్రజలతో కలిసి ప్రయాణిస్తూ - రోడ్ల వెంట నడుస్తూ ప్రజల్లో ఒకడిగా నిలుస్తూ అసలైన ప్రజాప్రతినిధులు పేరుపొందుతున్నారు. తాజాగా ఆయన ఖమ్మంలోని బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ కనిపించారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News