ఒకటికి నాలుగుమార్లు ఆలోచించి మాట్లాడాలని పెద్దలు పదే పదే చెప్తుంటారు. దానికి కారణం లేకపోలేదు మనం ఒకసారి మాట్లాడిన తర్వాత , మన నోటి వెంట బయటకి వచ్చిన మాటను మళ్లీ వెనక్కి తీసుకోలేము. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగే ఉంటుంది. ఆ నష్టం మనకే కావచ్చు .. లేకపోతే ఎదుటివారికి కావచ్చు. ఇక రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని , సరైన పదజాలం తో ఆ అంశం పై పూర్తి అవగాహనాతో మాట్లాడాలి. లేకపోతే నలుగురిలో నవ్వులు పాలు కావడం ఖాయం. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఖుష్బూ విషయంలో జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గం గత ఎమ్మెల్యే పై విరుచుకుపడింది. దానికి జనం నవ్వడం తో ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఏం చేయాలో తెలియక దిక్కులు చూశారు. అసలు విషయం ఏమిటంటే .. ఆమె విమర్శించిన ఎమ్మెల్యే కూడా ఆమె పక్కనే నిల్చొని ఉన్నారు. పక్క పార్టీ ఎమ్మెల్యే అనుకోని .. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే విరుచుకుపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే .. చెన్నైలోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నటి ఖుష్బూ బరిలో వున్న విషయం తెలిసిందే. ఆమె నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంలో ఖుష్బూ సొంత పార్టీ నేతపైనే నిప్పులు చెరిగారు. దీంతో పక్కనే ఉన్న ఆయన ఇబ్బంది పడ్డారు. ప్రచారంలో ఖుష్బూ మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలకు జనం నవ్వుతూ కేకలు వేశారు. ఖుష్బూ వ్యాఖ్యలతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే కేకే సెల్వం ఇబ్బంది పడగా, గమనించిన ఓ నేత మీరు మండిపడుతున్నది ఈయన మీదే, అనడంతో ఖుష్బూ నాలుక్కరుచుకున్నారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటివరకు ఈ నియోజక వర్గ ఎమ్మెల్యేగా వున్న కేకే సెల్వం ఇటీవల డీఎంకే నుంచి బీజేపీలో చేరారు. ఆ విషయం తెలియని ఖుష్బూ యథాలాపంగా విమర్శలు కురిపించారు.