దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ కియా మోటార్స్ కంపెనీ నష్టాల బాట పట్టింది. ఆ కంపెనీ చైనా దేశంలో నెలకొల్పిన అతిపెద్ద కార్ల తయారీ ప్లాంట్ ను తాజాగా నిర్వహణ భారం మోయలేక మూసివేసింది. ఉత్పత్తికి అనుగుణంగా మార్కెట్ లో కార్లు అమ్ముడుపోకపోవడంతో కియా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్ లో ఏర్పాటు చేసిన కియా కార్ల తయారీ ప్లాంట్ లో సంవత్సరానికి 8 లక్షల 90వేల కార్లను కంపెనీ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. 2002లో ఏర్పాటు చేసిన ఈ కార్ల తయారీ ప్లాంట్ లో 6500మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొదట కంపెనీ చైనాలో ప్రారంభించగానే కార్లు బాగా అమ్ముడు పోవడంతో మరో రెండు చోట్ల ప్లాంట్లను నెలకొల్పింది. కానీ ఇప్పుడు గడిచిన రెండేళ్లుగా అనేక కారణాల వల్ల కియా కార్ల అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 2017లో కార్ల అమ్మకాల వృద్ధి 44శాతం మేర పడిపోయింది. 2018లో కేవలం 9శాతం మాత్రమే కార్ల అమ్మకాల్లో వృద్ధి సాధించింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో చైనాలో కార్ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి.
దీంతో చైనాలో ప్లాంట్ ను కొనసాగించడం వల్ల నష్టం వస్తుందనే ఉద్దేశంతో కియా కంపెనీ చైనా ప్లాంట్ ను మూసివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. చైనాలోని యాంగ్ చెన్ కార్ల తయారీ ప్లాంట్ నుంచి తాము వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంటున్నామని తాజాగా కియా మోటార్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
కియా నష్టాల బాటలో పయనించడంతో ఆంద్రప్రదేశ్ లోని అనంతపురంలో నెలకొల్పిన ఆ కంపెనీ ఉత్పత్తి ప్లాంట్ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక కార్లు అమ్ముడుపోయే చైనాలోనే కియా కంపెనీ మూసివేయడంతో అనంతపురం ప్లాంట్ సంగతేంటి అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మన దేశంలో డిమాండ్ ఉన్నా మారుతి, రెనో, నిస్సాన్ వంటి చవక కార్లకే జనం ఆదరణ ఉంటోంది. ఈ నేపథ్యంలో కియా కార్లు వినియోగదారులకు చేరాలంటే కియా కష్టపడాల్సిందే. అమ్మాకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా అనంతపురం కియా ప్లాంట్ కూడా మూసివేయవచ్చనే సంకేతాన్ని కియా ఇచ్చినట్టైంది.
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ సంస్థ కార్ల తయారీ ప్లాంట్ ను నిర్మించింది. దేశంలోనే కియాకు ఇది మొట్టమొదటిది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తొలికారును ఇటీవలే ఆవిష్కరించారు. అయితే అది ఇక్కడ ఉత్పత్తి అయిన కారు కాదని.. పూర్తిస్థాయిలో కారు తయారు కాలేదని విమర్శలు వచ్చాయి. కియా కారు బేసిక్ ధర కూడా చాలా ఎక్కువ. 9 లక్షల నుంచి 18లక్షల వరకూ ఖరీదైంది. దీంతో కియా కార్ల మనుగడ దేశంలో సాగుతుందా.? ఆ కార్ల కంపెనీ వృద్ధి సాధిస్తుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.