పడిక్కల్​ ఆటచూసి కిచ్చ సుదీప్​కు పిచ్చెక్కిందట..!

Update: 2021-04-23 13:30 GMT
ఆర్​సీబీకి చెందిన దేవ్​దత్​ పడిక్కల్​ నిన్న రాజస్థాన్​ రాయల్స్​ తో జరిగిన మ్యాచ్​లో హీరోగా మారిపోయాడు. ఈ ఐపీఎల్​ లో తొలి సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు. అంతేకాక అతి చిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్​గా కూడా పేరు సాధించాడు. నిన్నటి మ్యాచ్​ లో పడిక్కల్​ వన్​మ్యాన్​ షో చేశాడు. ఏకంగా 101 పరుగులతో నాటౌట్​ గా నిలిచాడు. జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.

పడిక్కల్​ సిక్స్​లు, ఫోర్లతో ముంబైలోని వాంఖడే స్టేడియం మారు మోగిపోయింది. నిన్నటి మ్యాచ్​ లో తొలుత బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​ రాయల్స్​ 177 పరుగులు చేసింది. అయితే ఆ స్కోరును ఒక్క వికెట్​ కూడా నష్టపోకుండా చేజ్​ చేసింది ఆర్​సీబీ. దెబ్బకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే పడిక్కల్​ ఆటతీరు.. ఆర్​సీబీ అభిమానులనే కాదు.. క్రికెట్​ ఫ్యాన్స్​ అందరిని సమ్మోహన పరిచాయి. విరాట్​ కోహ్లీ సైతం పడిక్కల్​ ఆటతీరును ఎంజాయ్​ చేశాడు.  పడిక్కల్​ 52 బంతుల్లో 101 పరుగులచేసి నాటౌట్​ గా నిలిచాడు. తన పేరు మీద సరికొత్త రికార్డ్‌ ను లిఖించుకున్నాడు.

 అతి పిన్న వయస్సులో వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ ను అందుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడతను. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆర్​ఆర్​ 177 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత క్రీజ్​ లోకి వచ్చిన పడిక్కల్​, కోహ్లీ చెలరేగి పోయారు. ఆర్​ఆర్​ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఒక్క వికెట్​ కూడా తీయలేకపోయింది. మొత్తం ఆరుగురు బౌలర్లు వివిధ వేరియేషన్స్​తో బౌలింగ్​ చేశారు. అయినప్పటికీ పడిక్కల్​, కోహ్లీ ఏ మాత్రం తగ్గలేదు. తమదైన స్టయిల్​లో దూసుకెళ్లారు.

ఐపీఎల్‌ లో అతి చిన్న వయస్సులో సెంచరీ మార్క్‌ ను అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్ పడిక్కల్. అతని వయస్సు 20 సంవత్సరాల 289 రోజులు. ఈ ఏజ్‌ లో సెంచరీ చేసిన మూడో ఆటగాడతను. అతని కంటే ముందు- మనీష్ పాండే, రిషబ్ పంత్ ఉన్నారు. మనీష్ పాండే-19 సంవత్సరాల 253 రోజులు, రిషబ్ పంత్-20 సంవత్సరాల 218 రోజుల్లో సెంచరీ చేశారు.

ఇక పడిక్కల్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖ నటుడు, కన్నడ స్టార్​ హీరో కిచ్చ సుదీప్​ ఈ విషయంపై మాట్లాడుతూ..  ‘నిన్న జరిగిన ఐపీఎల్​ మ్యాచ్ ను ఎంతో ఎంజాయ్​ చేశా. కేవలం పడిక్కల్​ కోసమే ఈ మ్యాచ్​ చూశా. అతడి బ్యాటింగ్​ స్టయిల్​  అద్భుతంగా ఉంది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కూడా పడిక్కల్​ కు అవకాశం ఇచ్చాడు. తనకు సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. పడిక్కల్​ కు ఎక్కువ స్ట్రయిక్​ ఇచ్చాడు.’ అంటూ ప్రశంసలు కురిపించాడు సుదీప్​.మాజీ క్రికెటర్​ శ్రీకాంత్​ మాట్లాడుతూ.. ‘ దేవదత్​ పడిక్కల్​ టీం ఇండియాకు మరో మణిపూస. అతడికి మంచి భవిష్యత్​ ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు. పలువురు సీనియర్​ క్రికెటర్లు, విదేశీ క్రికెటర్లు సైతం పడిక్కల్​ ను ప్రశంసించారు.
Tags:    

Similar News