కాలిఫోర్నియాలో కిడ్నాప్ చేయబడిన భారతీయ సంతతికి చెందిన కుటుంబం కేసు మిస్టరీగా మారింది. ఈ కేసు తేలకపోవడంతో లోతుగా విశ్లేషణ జరుపుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఒకరికి చెందిన ట్రక్కు దగ్ధం కావడంతో ఈ కేసు చిక్కుముడిగా మారింది. కానీ ఇప్పటికీ కిడ్నాప్ చేయబడిన కుటుంబం కనిపించలేదు - ఎనిమిది నెలల పాప అరూహి ధేరి, ఆమె తల్లిదండ్రులు, జస్లీన్ కౌర్ (27), జస్దీప్ సింగ్, 36, అమన్‌దీప్ సింగ్( 39) జాడ దొరకలేదు..
మంగళవారం 48 ఏళ్ల వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఆత్మహత్యాయత్నం తర్వాత ఆసుపత్రిలో "క్లిష్ట పరిస్థితి"లో ఉన్నారని మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. అమన్‌దీప్ సింగ్ భార్య, జస్‌ప్రీత్ కౌర్, బాధితుల విడుదల కోసం టీవీలో పోలీసులు, బాధితుల తరుఫున విజ్ఞప్తి చేస్తున్నారు. "ఈ కుటుంబాన్ని తీసుకెళ్లిన వ్యక్తులను వేడుకుంటున్నాం, దయచేసి వారిని వదిలివేయండి.' అని కోరుతున్నారు. "నా మేనకోడలు, ఆమె కేవలం 8 నెలల పాప మరియు ఆమె వారితో ఎటువంటి ఆహారం లేదు," ఆమె చెప్పింది.
మెర్సిడ్ కౌంటీ శాన్ ఫ్రాన్సిస్కోకు ఆగ్నేయంగా 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలను షెరీఫ్ కార్యాలయం తెలిపింది. సోమవారం అమన్‌దీప్ సింగ్‌కు చెందిన ట్రక్కు హైవేపై కాలిపోతున్నట్లు గుర్తించినప్పుడు కిడ్నాప్ గురించి వారు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యులు నలుగురు కిడ్నాప్ అయినట్టు నివేదించారు.
జస్‌ప్రీత్ కౌర్ కేటీఎల్ఏ టీవీకి తన భర్త ఆ రోజు ఉదయం 8 గంటలకు పనికి వెళ్లాడని.. సుమారు 11 గంటలకు ఫ్రంట్ డెస్క్‌లో ఎవరూ లేరని తనకు కాల్ వచ్చిందని, ఆమె అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, కాల్‌లు వాయిస్‌మెయిల్‌కి వెళ్లాయని చెప్పారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని షెరీఫ్ కార్యాలయం జీసస్ మాన్యువల్ సల్గాడోగా గుర్తించింది, అతని గురించి సమాచారం అందుకున్న తర్వాత అతన్ని పట్టుకున్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ముందు తన ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించాడని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
కిడ్నాప్ బాధితుల్లో ఒకరికి చెందిన బ్యాంకు కార్డు ఏటీఎం మెషీన్‌లో ఉపయోగించబడిందని ఒక బ్యాంకు నివేదించిందని.. దానిని ఉపయోగిస్తున్న వ్యక్తి చిత్రాన్ని అధికారులు విడుదల చేశారు. మూతికి మాస్క్.. తలపై క్యాప్ ధరించి గుర్తుపట్టకుండా అతడు ఉన్నాడు. కిడ్నాప్ చేసింది ఇతడే అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది. కానీ ఏటీఎం ఫోటోలో ఉన్న వ్యక్తి "కస్టడీలో ఉన్న వ్యక్తి కాదని".. "సరైన ఫోటోను పొందేందుకు" బ్యాంకుతో కలిసి పని చేస్తున్నాడని పేర్కొంది.
పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి 2005లో సల్గాడో దోపిడీకి పాల్పడ్డాడని ఫ్రెస్నోలోని మీడియాలో కథనాలు వచ్చాయి. మెర్సిడ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అతను తుపాకీతో ఇంటిపై దాడి చేయడం, సాక్షులను బెదిరించడం మరియు ఆ కేసులో తప్పుడు జైలు శిక్షకు ప్రయత్నించడం వంటి అభియోగాలు మోపబడిందని తెలిపారు.అతను 2015లో జైలులో ఉండి విడుదలయ్యాడట..
ఆ కుటుంబం జాడ కనిపెట్టాలంటే సూసైడ్ యత్నం చేసిన ఆ అనుమానుతుడే కీలక సాక్ష్యం.. కుటుంబం ఎక్కడ ఉంది, వారి పరిస్థితి ఏమిటనే దానిపై మాకు ఇంకా ఎటువంటి ఆధారాలు లేవు." అని పోలీసులు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.