వాళ్లను చంపాలి.. నోరుజారిన గవర్నర్

Update: 2019-07-22 07:07 GMT
రెండోసారి బీజేపీ గద్దెనెక్కాక ఆ పార్టీ నాయకులు - ఎంపీలు - మంత్రులు కూడా సమరోత్సాహంతో చేస్తున్న మాటలు - దాడులు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ నియమించిన గవర్నర్లు కూడా అదే రీతిలో దుందుడుకుగా వ్యవహరిస్తూ వివాదాలు రేపుతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నోరుజారి ఆయన చిక్కుల్లో పడ్డారు.

జమ్మూకాశ్మీర్ ఎప్పుడు ఉగ్రవాదులు - సైనికుల మధ్య దాడులు - ప్రతిదాడులతో రగిలిపోతూనే ఉంటుంది. ఉగ్రవాదులు అమయాక ప్రజలను టార్గెట్ చేసి బలితీసుకుంటారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

కార్గిల్ లోని ఖ్రీసుల్తాన్ ఛూ స్టేడియంలో గవర్నర్ సత్యపాల్ లడక్ టూరిజం ఫెస్టివెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు చంపాల్సింది అమాయక ప్రజలను కాదని.. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులని అని గవర్నర్ నోరుజారారు.  తుపాకులతో రాజ్యం చేయాలని ప్రజలను చంపడం కాదని.. కాశ్మీర్ ను దోచుకుంటున్న వారిని దమ్ముంటే చంపాలని ఆయన ప్రకటించడం దుమారం రేపింది.

ఈ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల నేతల భగ్గుమన్నారు. గవర్నర్ వ్యాఖ్యలతో ఏ రాజకీయ నాయకుడిని - అధికారిని చంపినా గవర్నర్ వల్లేనని ఎన్సీపీ నేత ఓమర్ అబ్ధుల్లా ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నర్ ఆటవిక రాజ్యాన్ని తెస్తున్నారని.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జీఏ మిర్ ఆరోపించారు.

అచయితే గవర్నర్ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన తప్పు తెలుసుకొని మీడియా ముందు వివరణ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని.. కాశ్మీర్ లోని అవినీతిని చూడలేక అలా భావోద్వేగంతో మాట్లాడానని వివరణ ఇచ్చారు.


Tags:    

Similar News