తాత జ‌యంతికి గైర్హాజ‌రు..కిమ్ ఏమ‌య్యాడు?

Update: 2020-04-18 13:30 GMT
అనూహ్య నిర్ణ‌యాలు తీసుకుంటూ అమెరికాతో పాటు ప్ర‌పంచాన్ని వ‌ణికించే వ్య‌క్తి ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్‌. ప్ర‌స్తుతం అత‌డు క‌నిపించ‌డం లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో అత‌డు సైలెంట్‌ గా ఉన్నాడు. అయితే త‌మ దేశంలో ఇంకా క‌రోనా వైర‌స్ అడుగుపెట్ట‌లేద‌ని ఆ దేశం చెబుతుండ‌గా అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని - నిజాలు కప్పి పుచ్చుతున్నార‌ని అంత‌ర్జాతీయ స‌మాజం చెబుతోంది. అయితే అవ‌న్నీ ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం కిమ్ ఆ దేశంలో క‌నిపించ‌డం లేద‌ని హాట్ టాపిక్‌ గా మారింది. ఎందుకంటే త‌న తాత జ‌యంతి వేడుక‌ల‌కు గైర్హాజ‌ర‌య్యాడు. దీంతో ఆ దేశంతో పాటు ప్ర‌పంచంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఉత్తర కొరియాలో తొలి అధ్యక్షుడిగా వ్యవహరించిన కిమ్ ఇల్ సంగ్ ప‌ని చేశారు. 1948 నుంచి 1994వ‌ర‌కు ఉత్త‌ర కొరియాకు అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆ తరువాత ఆయ‌న త‌న‌యుడు కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. అనంత‌రం 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణానంతరం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పగ్గాలు అందుకున్నారు. అయితే దేశానికి తొలి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన కిల్ ఇల్ సింగ్ జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా వేడుకగా నిర్వ‌హిస్తారు. ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించడమేకాకుండా- డే ఆఫ్‌ ది సన్‌ గా అక్క‌డి దేశంలో వ్యవహరిస్తారు.

అయితే ఇటీవ‌ల ఉత్త‌ర కొరియాలో త‌న తాత కిల్ ఇల్ సంగ్ జయంతి వేడుక‌లు కుమ్సుసన్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ సన్‌ లో నిర్వ‌హించారు. అయితే ఈ వేడుక‌ల‌కు అధ్య‌క్షుడు - మ‌న‌వ‌డు కిమ్ జోంగ్ ఉన్ గైర్హాజ‌ర‌య్యాడు. అత‌డు రాక‌పోవ‌డంతో ఉత్తర కొరియా సీనియర్‌ అధికారులు కిల్ ఇల్ సంగ్‌ కు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ గైర్హాజ‌ర‌వ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఈ వేడుకల్లో అత‌డు పాల్గొన‌లేదు. అయితే అత‌డు పాల్గొన‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అత‌డి ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ద‌ని చ‌ర్చ సాగుతోంది.

చైన్‌ స్మోకింగ్‌ చేసే అధ్య‌క్షుడు కిమ్ ఊబకాయంతో కూడా బాధపడుతున్నారు. తాత కిమ్‌ ఇల్ సంగ్‌ లు - తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఊబ‌కాయులే కాక చైన్ స్మోకర్లే. వారి అల‌వాట్లే కిమ్‌ కు వ‌చ్చాయి. అయితే తాత‌ - తండ్రి ఇద్దరూ గుండెపోటుతోనే మృతిచెందారు. ప్ర‌స్తుతం కిమ్ కూడా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధప‌డుతున్నార‌ని చ‌ర్చ సాగుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌డం లేదు. ఉత్త‌ర కొరియాలో తీవ్ర ఆంక్ష‌లు.. నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయి. ఆ దేశానికి చెందిన స‌మాచారం ఎలాంటిది.

బ‌య‌ట‌కు పొక్క‌కుండా అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఆ దేశంలో వ్యాప్తి చెందిందా లేదా? ఎన్ని కేసులు వ‌చ్చాయ‌నేది తెలియ‌డం లేదు. ఈ క్ర‌మంలో కిమ్ ఆ వేడుక‌ల‌కు గైర్హాజ‌రు కావ‌డం అనేది చూస్తుంటే వ‌స్తున్న పుకార్లే వాస్త‌వంగా భావించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.
Tags:    

Similar News