ఉత్తరకొరియా నియంత, అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ మేనత్త కిమ్ క్యోంగ్ హుయి బతికే ఉన్న విషయం ప్రపంచానికి తెలిసివచ్చింది. ఇన్నాళ్లు అధ్యక్షుడు కిమ్ ఆమెను చంపేశారన్న ఊహాగానాలకు తెరదించుతూ ఆరేళ్ల తర్వాత తొలిసారి ఆమె బహిరంగంగా కనిపించడం విశేషం.
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ కు కిమ్ క్యోంగ్ హుయి స్వయాన చెల్లెలు. హుయి భర్త చాంగ్ సాంగ్ తాయెక్ కు 2013లో ‘దేశద్రోహం’ కింద కిమ్ జాంగ్ ఉన్ మరణశిక్ష విధించి చంపించేశారు. ఉత్తర కొరియాలో కిమ్జాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేత తాయెక్ కావడంతో తన పీఠానికి ఎసరు వస్తుందనే కిమ్ జాంగ్ చంపించేశారన్న విమర్శలు వచ్చాయి.
తన భర్త తాయెక్ ను అధ్యక్షుడు, మేనల్లుడు అయిన కిమ్ జాంగ్ చంపించివేశాక నుంచి హుయి ఎక్కడా బయటకు కనిపించలేదు. ఆమెను కూడా కిమ్ చంపించివేశారని ఊహాగానాలు వచ్చాయి.
తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కిమ్ జాంగ్ ఉన్ తో పాటు ఆయన మేనత్త కిమ్ క్యోంగ్ హుయి కనిపించడం ఆ ఫొటోలను ఉత్తర కొరియా వార్త సంస్థ విడుదల చేయడంతో వైరల్ గా మారింది.తన భర్తను చంపించిన కిమ్ పక్కనే ఆమె కూర్చుండడం విశేషం.