కొంగొత్తగా కనిపిస్తున్న కొరియా సైన్యం, నియంత కిమ్ జాంగ్

Update: 2021-09-10 13:40 GMT
ప్రపంచం మొత్తం చూపు తనవైపు తిప్పుకునేలా ఏదో ఒక సంచలనం సృష్టించడం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు అలవాటు. కానీ ఈసారి చాలా సాదాసీదగా కనిపించాడు. ఉత్తరకొరియా 73వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ దేశ సైన్యం కొంగొత్త డ్రెస్ తో పరేడ్ నిర్వహించింది.

గతంలో మాదిరిగా హంగు ఆర్భాటాలు లేకుండా ఆయుద్ధ సంపత్తిని బహిరంగ పర్చకుండా క్షిపణుల జాడ లేకుండా కేవలం ‘హజ్మత్’ సూట్ లో సైన్యం రాత్రి పూట పరేడ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయాలను అక్కడి మీడియా కథనాలుగా ప్రచురించింది.

ఆరేంజ్ రంగులో హజ్మత్ సూట్ లో పరేడ్ చేస్తున్న ఉత్తర కొరియా సైన్యం ఫొటోలను ప్రముఖంగా ప్రచురించారు. ఎలాంటి క్షిపణులను గానీ.. ఇతర సాంకేతిక పరికరాలు కానీ ప్రదర్శించలేదని మీడియా పేర్కొంది.

ప్యాంగ్యాంగ్ లోని కిమ్ 2 సంగ్ స్వ్కేర్ లోని బుధవారం అర్థరాత్రి నిర్వహించిన జాతీయ దినోత్సవాలకు దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ హాజరై సైన్యం పరేడ్ గౌరవ వందనం స్వీకరించారని వార్తలు వెలువడ్డాయి.

ఇక తాజాగా నిర్వహించిన కవాతులో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ చాలా స్లిమ్ గా కనిపించి అందరి దృష్టిలో పడ్డాడు. దాదాపు 20 పౌండ్ల బరువు తగ్గాడా? అంటే ఔననే అంటున్నారు. కిమ్ సైనిక కవాతు కోసం క్రీమ్ రంగు సూట్ ధరించి బాల్కనీలో కూర్చున్నాడు.

కవాతు సందర్భంగా కిమ్ మాట్లాడకపోయినా.. తనకు పూలు అందించిన పిల్లలను ముద్దాడాడు. స్థూలకాయంతో కనిపించిన కిమ్ తాజాగా సన్నగా కనిపించి అందరికీ షాకిచ్చాడు. కిమ్ బరువు తగ్గడం ఆరోగ్య సమస్యల వల్లేనని అంటున్నారు.
Tags:    

Similar News