కిమ్ జోంగ్‌ కు ఏమైంది? ‌చేతిపై ఆ గుర్తులేమిటీ?

Update: 2020-05-03 11:10 GMT
ప్ర‌పంచానికి క‌రోనా వైర‌స్ వ్యాప్తితో పాటు మ‌రో అంశం ఇన్నాళ్లు హాట్ టాపిక్‌ గా ఉన్న‌ది. అదే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ క‌నిపించ‌డం లేద‌ని.. అత‌డు మ‌ర‌ణించాడ‌ని వార్త‌లు వ్యాప్తి చెందాయి. కిమ్ జోంగ్‌ పై రోజుకొక వార్త‌లు వినిపించాయి. అత‌డు మ‌ర‌ణించాడని - హృద్రోగంతో పాటు ఉబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని పుకార్లు వ‌చ్చాయి. వాటితో బాధ‌ప‌డుతూ ఏకంగా మ‌ర‌ణించాడ‌ని వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌న్నింటిని అమెరికా అధ్య‌క్షుడు డొన‌ల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. కిమ్ ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌టించాడు. ట్రంప్ చెప్పిన‌ట్టు ఇటీవ‌ల అక‌స్మాత్తుగా బాహ్య ప్ర‌పంచంలోకి కిమ్ జోంగ్ వ‌చ్చారు. అయితే ఇన్నాళ్లు ఏ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు.. అత‌డికి ఏమైంది? ఏం చికిత్స తీసుకున్నారు.. అనేది ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి.

త‌మ అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ కు సంబంధించిన ఫొటోలు - వీడియోల‌ను ఉత్త‌ర కొరియా మీడియా విడుద‌ల చేసింది. మూడు వారాల‌పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిమ్ ఉత్త‌ర కొరియాలోని సంచోన్‌ లో ఎరువుల ఫ్యాక్ట‌రీ ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న సోద‌రి అందించిన క‌త్తెర‌తో రిబ్బ‌న్ క‌టింగ్ చేశారు. న‌ల్ల‌ని సూట్ వేసుకుని - కొత్త హెయిర్ స్టైల్‌ తో న‌వ్వులు చిందిస్తూ ఉత్సాహంగా క‌నిపించారు. అయితే ఆ విడుద‌ల చేసిన ఫొటోల్లో కిమ్ చేతికి ఒక గుర్తు ఉంది. అయితే ఆ చేతిపై ఉన్న గుర్తు ఏమిటి? అస‌లు కిమ్‌ కు ఏమైంది? ఏ వ్యాధి సోకింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

అయితే కిమ్ అనారోగ్యానికి గుర‌య్యాడ‌నే విష‌యం మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంది. అత‌డు చికిత్స పొందిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని స‌మాచారం. విడుద‌ల చేసిన ఫొటోల్లో కిమ్ కుడి చేతిపై ఆ మార్క్ అదే చెబుతోంది. అది హృద‌య‌నాళ (కార్డియో వాస్క్యుల‌ర్ ప్రొసీజ‌ర్‌)కు సంబంధించి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దానికి చికిత్స పొంద‌డానికి రేడియ‌ల్ ఆర్ట‌రీ పంక్చ‌రీ చేసుకున్నాడ‌ని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు కిమ్‌ హార్ట్ స‌ర్జ‌రీ చేసుకున్నాడేమోన‌ని.. అందుకోస‌మే కొన్ని వారాలు బాహ్య ప్ర‌పంచం ముందుకు రాలేక‌పోయాడ‌ని చ‌ర్చ సాగుతోంది.

ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించడం నిజం కాదని - ఆయన సేఫ్ గా ఉన్నారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే నిజమైంది. 20 రోజుల గ్యాప్ తర్వాత, పుకార్లకు చెక్ పెడుతూ కిమ్ ప్రజలముందుకొచ్చారు. ప్రియమైన శతృవు పునరాగమనాన్ని ట్రంప్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పూర్తి ఆరోగ్యంతో ఉండటం, మళ్లీ ప్రజల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉందని అధ్య‌క్షుడు డొన‌ల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News