కిమ్ కంటే వందరెట్లు డేంజర్..వారసురాలు ఎంట్రీ?

Update: 2020-04-21 11:30 GMT
ఉత్తరకొరియా నియంత - అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ గుండె శస్త్రచికిత్స తిరగబడిందని. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన మరణిస్తే తర్వాత వారసురాలు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఆ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

ఈ క్రమంలో కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి ‘కిమ్-యే-జాంగ్’ అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఉత్తరకొరియా దేశంపై కిమ్ యే జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. ఈ మేరకు కిమ్ జాంగ్ మరణంతో అక్కడ ఈ నియంత కుటుంబాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిద్దామని ఎదురుచూస్తున్న దేశాలకు హెచ్చరికలు కూడా పంపినట్టు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలనే చిన్నప్పటి నుంచి ఆయన సోదరి కిమ్ యే జాంగ్ వంటపట్టించుకున్నారట.. వాళ్ల కుటుంబంలో అన్నకు తోడు సర్వాధికారాలు కలిగి ఉంటే దేశంలో పాలనలో తనదైన ముద్ర వేస్తుందట.. ఆ మధ్య దక్షిణ కొరియాను ఈమె కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం దుమారం రేపింది. కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత కఠినాత్మురాలు.. డేంజర్ అని ఆ దేశస్థులు చెబుతున్నారు.

అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాలన వ్యవహరాల్లో ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యే జాంగ్ నే నమ్ముతారు. విదేశీ నాయకులతో - దక్షిణ కొరియాతో ఎలా డీల్ చేయాలో చెల్లెలు చెప్పినట్టు కిమ్ చేస్తారని ప్రచారంలో ఉంది. దీంతో కిమ్ మరణిస్తే నెక్ట్స్ వారసురాలు ఆమే కానుంది. కిమ్ కంటే కఠినంగా ఈమె ఉంటుందని తెలియడంతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి.

అయితే కిమ్ ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయన ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీలేదని దక్షిణ కొరియా ప్రకటించింది.
Tags:    

Similar News