కిమ్ జాంగ్ సంతానం.. రహస్య జీవితం

Update: 2020-04-21 16:30 GMT
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే ఆయన చేయించుకున్న గుండె సర్జరీ తిరగబెట్టిందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోందట.. దీనికి సీఎన్ఎన్ కథనం కూడా బలాన్ని ఇస్తోంది. దక్షిణ కొరియా వార్త సంస్థలు కూడా దీన్ని ధృవీకరించాయి.

అయితే నియంత కిమ్ జాంగ్ మరణిస్తే ఆయన వారసులు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. ఎందుకంటే కిమ్ జాంగ్ వ్యక్తిగత జీవితం పూర్తి రహస్యంగా ఉంచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని సమాచారం. కానీ వారు ప్రపంచం దృష్టికి దూరంగా రహస్యంగా పెరుగుతున్నారట..

కిమ్ జాంగ్ ఉన్ భార్య పేరు ‘రిసోల్ జూ’ అని చెబుతుంటారు. 2012లో ఈమెను పెళ్లి చేసుకున్నాడట.. వీరికి ముగ్గురు పిల్లలు. వారి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తన వారసత్వంపై శత్రువులు కుట్ర పన్నుతారనే ఆయనే ఇలా భార్య, పిల్లలను రహస్యంగా ఉంచారట..

కిమ్ జాంగ్ కుటుంబం గురించి దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ అధికారుల వద్ద సమాచారం ఉంది. కిమ్ పెద్ద కొడుకు వయసు 10 సంవత్సరాలని వారు తెలిపారు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్న కిమ్ జాంగ్ చనిపోతే ఆయన వారసుడు 10 ఏళ్ల కొడుకు కాలేడని.. బహుశా కిమ్ చెల్లెలు మరో నియంత కాగలదని తెలుస్తోంది.కిమ్ తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన చెల్లెలు కీరోల్ పోషిస్తుంటుంది.
Tags:    

Similar News