అవును.. గ‌వ‌ర్న‌ర్ గోడ దూకారు

Update: 2017-10-27 06:56 GMT
ఐర‌న్ ఉమెన్ గా.. నిజాయితీకి నిలువుట‌ద్దంగా చెప్పుకునే మ‌హిళ‌గా కిర‌ణ్ బేడికి ప్ర‌త్యేక‌మైన పేరు  ప్ర‌తిష్ట‌లున్నాయి. ప్ర‌స్తుతం ఆమె పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు విష‌యాల్లో త‌న‌దైన నిర్ణ‌యాలు తీసుకుంటూ సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్న ఆమె తాజాగా  త‌న వైఖ‌రితో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు.

క‌రైక‌ల్ ప్రాంతంలో పర్య‌టించిన ఆమె అక్క‌డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆసుప‌త్రిలోని సైక‌ర్యాలు.. రోగుల‌కు అందుతున్న స‌దుపాయాల గురించి అక్క‌డివారిని అడిగి తెలుసుకున్నారు. ఆసుప‌త్రి వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌టం.. పారిశుద్ధ్యం ప‌ట్ల అక్కడి సిబ్బంది శ్ర‌ద్ధ చూపించ‌క‌పోవ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా త‌న తీరుతో వైద్యాధికారులకు వ‌ణుకు పుట్టించి ఆమె మ‌రో సాహ‌సం చేశారు.

ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేకంగా ఉన్న ఒక గ‌దికి అవ‌ర్ లేడీ ఆఫ్ లార్డ్స్ అన్న పేరును చూశారు. ఆ గ‌దిని చూడాల‌ని భావించారు. అయితే.. ఆ గ‌దికి చుట్టూ నాలుగు అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేటు పెట్టారు. గేటుకు తాళాలు వేసి ఉండ‌టంతో.. ఆ గ‌ది తాళం చెవులు తీసుకురావాల‌ని కోరారు.

అయితే.. గ‌ది తాళాల్ని అక్క‌డి సిబ్బంది ఎక్క‌డో పెట్టి మ‌ర్చిపోవ‌టంతో  కాసేపు వెయిట్ చేసిన ఆమె.. చివ‌ర‌కు గోడ ఎక్కి దూకేశారు. అక్క‌డి షెడ్ లోకి వెళ్లిన ఆమె.. అక్క‌డి ప‌రిస్థితుల్ని చూశారు. అంత పెద్ద స్థానంలో ఉన్న గ‌వ‌ర్న‌రే గోడ దూకేయ‌టంతో ఆమె బాట‌లోనే మిగిలిన అధికారులు సైతం గోడ దూకాల్సి వ‌చ్చింది. గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ గోడ దూక‌టంతో క‌రైక‌ల్ క‌లెక్ట‌ర్‌.. ఆసుప‌త్రి సీనియ‌ర్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ తో పాటు ఇత‌ర అధికారులు సైతం గోడ‌లు దూకాల్సి వ‌చ్చింది. తాను మాత్ర‌మే కాదు.. ప‌లువురు సీనియ‌ర్ అధికారుల్ని గోడ దూకించిన ఘ‌న‌త కిర‌ణ్ బేడీకి ద‌క్కింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News