అంత పెద్ద సెలబ్రిటీ ఎంత సింఫుల్ గా రోడ్డు పక్క టిఫిన్ తిన్నారో

Update: 2022-05-03 15:30 GMT
'డబ్బులు ఊరికే రావు' అంటూ బంగారం కొనుగోలు చేసే సమయంలో ఏమేం చేయాలన్న దానిపై అవగాహన పెంచటంతో పాటు.. బంగారం యాడ్స్ కు సంబంధించి సరికొత్త ట్రెండ్ ను తీసుకొచ్చిన క్రెడిట్ లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ కే చెల్లుతుంది. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఒక దోశ బండి వద్ద ఎలాంటి ఆర్భాటం లేకుండా టిఫిన్ చేస్తున్న వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రస్తుతం యాభై ఏళ్లు ఉన్న లలితా జ్యూయలెర్స్ కిరణ్ కుమార్ బాల్యంతో పాటు టీనేజ్ జీవితం కూడా కష్టాలు.. సవాళ్లతోనే సరిపోయిందని చెప్పాలి. సౌత్ లో లలితా జ్యూయలరీకి బోలెడన్ని షోరూంలు ఉన్నాయి. వాటిని చూసుకుంటే.. తీవ్రమైన పోటీ ఉన్న వ్యాపారంలో తన మార్కును చూపించటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో లలితా జ్యేయలర్స్ అధినేత పడిన కష్టం అంతా ఇంతా కాదు.

జీవితంలో తాను పడిన కష్టాల గురించి ఆయన చెప్పేందుకు సంకోచించరు. అంతేకాదు.. తనకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమిస్తారో కూడా చెబుతుంటారు. 1985లో చెన్నైలో మొదలైన ఆయన షోరూం అంచలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు సౌత్ లోనే బోలెడన్ని బంగారుషోరూంలను ఏర్పాటు చేయటం తెలిసిందే. డబ్బులు ఊరికే రావు అంటూ తన మాటలతో అందరిని ఆట్రాక్టు చేసే కిరణ్ రావు.. రియల్ లైఫ్ లో ఇంత సింఫుల్ గా ఉండటం ఆయనకు చెల్లు అని చెప్పాలి.

రోడ్డు పక్కనున్న బండి మీద పెట్టిన టిఫిన్ ను ఆయన తీసుకున్న వైనం.. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏమైనా.. అంతటి ఆయన స్వయంగా వచ్చి దోశెల్ని రోడ్డు పక్కన పోయించుకునే తినేస్తున్న వైనం రోటీకు చాలా దూరంగా ఉందని చెప్పక తప్పుదు.
Tags:    

Similar News