మౌనంతోనే సమాధానమిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి

Update: 2021-10-30 16:30 GMT
నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఈయన.. పాలనలోనూ అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఉధృతంగా ఉన్న సమయంలో తనదైన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. అనంతర పరిణామాల్లో రాష్ట్రం విడిపోవడం, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పట్లో సంచలనంగా మారిన ఆయన.. రానురాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఏదైనా కార్యక్రమంలో కనిపిస్తూ.. మిగతా సమయమంతా సొంత కార్యకలాపాలకే కేటాయిస్తున్నారు. తండ్రి అమరనాథ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని.. 1989 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.. రాష్ట్రం విడిపోయాక దాదాపు మసకబారిందనే చెప్పొచ్చు.

సమైక్యాంధ్రను బలపర్చేవారు ఇప్పటికీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన విభజనను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని దిక్కరించి ఆ పార్టీ రాజీనామా చేశారు. ఆ తర్వాత అదే స్పూర్తితో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. సహజంగా రాజకీయాల్లో సాదాసీదా నేతలు కూడా మీడియాకు ముందు హల్ చల్ చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా స్పీకర్‌, చీఫ్ వీఫ్‌గా పనిచేసిన ఆయన మాత్రం మౌనంగా ఏమి పట్టనట్టుగా ఉన్నారు. నిత్తేజంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో ఆహ్వానించారు. పెద్దల ఆహ్వానాన్ని మన్నించి తిరిగి సొంత గూటికి చేరారు. తిరిగి పార్టీలో చేరినా మౌనంగానే ఉంటున్నారు. నియోజకవర్గంతో కూడా సంబంధం లేకుండా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.

వయసు సహకరించడం పోవడం వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అనుకోవడానికి లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వతహగా క్రికెటర్ కాబట్టి వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయ వయసు 62 ఏళ్ళు. అంత వయసు ఉన్నప్పటికీ ఆయనలో వృధ్దాప్యం కనిపించదు. కాంగ్రెస్‌లో కీలక పదవి ఇస్తామని చెబుతున్నా ఆయన ఎందుకు ముందుకు రావడం లేదో ఎవరీ అంతు చిక్కడం లేదు. పార్టీ ఆహ్వానిస్తున్నా ఆయన మాత్రం మౌనంతోనే సమాధానం ఇస్తున్నారు. రఘువీరారెడ్డి పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని కూర్చోబెట్టాని కాంగ్రెస్ భావించిందంట. అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడంతో శైలజానాథ్‌ను పీసీసీ ఛీప్‌గా ఎంపిక చేశారని అప్పట్లు ప్రచారం జరిగింది. ఆయనును చాలాసార్లు తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నించిన ప్రతిసారి ఆశాభంగానికి గురవుతోంది.

ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఆ పార్టీ తన ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్ దూరంగా ఉన్న నేతలందరీని ఏకం చేసి ప్రచారం చేశాలని అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉప ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించినా... ఆయన సున్నితంగా తిరష్కరించారని చెబుతున్నారు. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. పిలిచి పదవులు ఇస్తామని అధిష్టానం పదేపదే ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన దూరమవుతూ వస్తున్నారు. అట్లని ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారా అంటే అది కూడా లేదు. అధిష్టానం మాత్రం ఆయనపై ఆశలు పెట్టుకుంది. తిరిగి క్రీయాశీలక రాజకీయాల్లో వస్తారని ఆశగా కాంగ్రెస్ పెద్దలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కోర్టులో బంతి ఉంది. గోల్ చేసి విన్నర్ అవుతారో లేక కోర్టులోకే రాకుండా బయటే ఉంటారో చూడాలి
Tags:    

Similar News