ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులకే ముస్లింలందరూ ఓట్లు వేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ కు ప్రజాస్వామ్యం పట్ల ఎంత నమ్మకముందో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని బీజేపీ శాసన సభా పక్షనేత కిషన్ రెడ్డి అన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం, మత కలహాలు సృష్టించడం కోసం అక్బరుద్దీన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.
అక్బరుద్దీన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని, ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని బీజేపీ ప్రతినిధి కృష్ణ సాగర్ డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని సాగర్ అన్నారు. అందుకే, ఇప్పటి వరకు అక్బరుద్దీన్ పై చార్జి షీటు కూడా నమోదు చేయలేదని చెప్పారు.
అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని సాగర్ చెప్పారు. అక్బరుద్దీన్ ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదని తెలిపారు. అక్బరుద్దీన్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ను పాస్ చేయాలని ఆయన కోరారు.