ఎంపీ ప‌ద‌విపై కిష‌న్‌ రెడ్డి మ‌న‌సులో మాట ఇది

Update: 2016-07-07 18:09 GMT
బీజేపీ మాజీ అధ్య‌క్షుడు - ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత కిష‌న్ రెడ్డి సుదీర్ఘ కాలం త‌ర్వాత త‌న మ‌నసులోని మాట బ‌య‌ట పెట్టారు. మూడు సార్లు ఎంపీగా - రెండు ద‌ఫాలుగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఇంకో రెండు సార్లు ఫ్లోర్‌ లీడర్‌ గా ఉన్న కిష‌న్‌ రెడ్డి ఎంపీ కాలేద‌ని బెంగ ప‌ట్టుకుంద‌ట‌. అంతేకాదు జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌లేక‌పోయాననే బాధ‌లో ఉన్నార‌ట‌. ఈ మాట స్వ‌యంగా కిష‌న్‌ రెడ్డే చెప్పారు మ‌రి.

ఇటీవ‌ల మీడియా మిత్రుల‌తో ముచ్చ‌టించిన కిష‌న్‌ రెడ్డి బీజేపీ గురించి, ప్ర‌స్తుత  రాజ‌కీయ ప‌రిణామాలు దాంతోపాటు త‌న రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో ఓ ప‌దేళ్ల వెన‌క్కు పోయారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న నరేంద్ర‌మోడీ జాతీయ నాయ‌కుడిగా ఎదుగుతున్న స‌మ‌యంలో త‌న‌కున్న స‌న్నిహిత్యాన్ని ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ యువ‌జ‌న‌మోర్చా జాతీయ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన రోజుల‌ను గుర్తుకుచేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే 2004 ఎన్నిక‌ల‌ను ప్ర‌స్తావిస్తూ అపుడు త‌న‌కు ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యే సీటు వైపే మొగ్గుచూపిన‌ట్లు తెలిపారు. దాంతో రాష్ట్ర రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయిన‌ట్లు వివ‌రించుకుంటూ వ‌చ్చారు. జాతీయ రాజ‌కీయాల ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూ అప్పుడే ఎంపీగా బ‌రిలోకి దిగితే బాగుండేద‌ని అన్నారు. అలా ముందుకు సాగితే ఎంపీగా గెలిచి ఉండ‌టం, అనంత‌రం ప‌రిణామాల‌తో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పే అవ‌కాశం వ‌చ్చేద‌ని అంటున్నారు. అలా కాక‌పోవ‌డం ఒక‌నాటి చారిత్ర‌క త‌ప్పిదం అంటూ ముక్తాయించారు.

మొత్తంగా మోడీ లాగా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డ‌మో అలా కాక‌పోయినా ప్ర‌ముఖ నేత‌గా ఉండే అవ‌కాశమో కోల్పోయిన బాధ కిష‌న్‌ రెడ్డిలో కనిపిస్తోంద‌ని ఈ సంభాషణ త‌ర్వాత ఆయ‌న స‌న్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News