హైదరాబాద్ రియల్ రంగంపై నైట్ ఫ్రాంక్ ఆసక్తికర రిపోర్టు.. ప్రపంచంలో 122వ ర్యాంక్
రియల్ రంగంలో హైదరాబాద్ మహానగరం దూసుకెళుతోంది. కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలో.. మిగిలిన నగరాలకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 122వ స్థానాన్ని దక్కించుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ కు సంబంధించి నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించిన నివేదికతో హైదరాబాద్ మహానగర ప్రత్యేకత మరోసారి చాటినట్లైంది. దేశంలోని మిగిలిన మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరం ముందంజలో ఉండటం గమనార్హం.
2020 త్రైమాసికంలో స్థిరాస్థి రంగంలో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా 122వ ర్యాంకును సొంతం చేసుకుంది. హైదరాబాద్ తర్వాతనే దేశంలోని మిగిలిన మహానగరాలు ఉండటం విశేషం. బెంగళూరు 129వ స్థానంలో నిలిస్తే.. అహ్మదాబాద్ 143.. ముంబై144.. ఢిల్లీ 146.. కోల్ కతా 147.. పుణె 148 స్థానాలు నిలిస్తే.. చెన్నై మహానగరం 150వ స్థానంతో అట్టడుగున నిలిచింది. కరోనా దెబ్బకు రియల్ మార్కెట్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. అన్నింటికి మించి ప్రపంచవ్యాప్తంగా నివాస స్థలాల ధరలు బాగా పడిపోయాయి. అలాంటివేళ.. ధరలు పెరిగిన ఏకైన నగరంగా హైదరాబాద్ నిలిచినట్లు సదరు నివేదిక వెల్లడించింది.
బెంగళూరులో ఇళ్ల ధరలు 0.8 శాతం తగ్గితే.. అహ్మదాబాద్ లో 3.1 శాతం.. ఢిల్లీలో 3.9 శాతం.. కోల్ కతాలో 4.3 శాతం.. ఫుణెలో 5.3 శాతం మేర ధరలు పెరిగితే హైదరాబాద్ లో మాత్రం 2019తో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల వృద్ధి రేటు 0.2 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో రియల్ ఎస్టేట్ రంగంలో టర్కీలోని అంకారా అగ్రగామిగా ఉన్నట్లుగా తేల్చారు. ఇక్కడ ఇళ్ల ధరల పెరుగుదల ఏటా 30.2 శాతంగా ఉండటం విశేషం. తర్వాతి స్థానం టర్కీలోని ఇజ్మిర్.. మూడో స్థానంలో ఇస్తాంబుల్ నిలిచాయి.