నానీలు ఇద్దరు : నోరు విప్పరెందుకు...?

Update: 2022-05-24 01:30 GMT
ఆ ఇద్దరు సరిగ్గా నెలన్నర  క్రితం వరకూ మీడియాలో నిత్యం కనిపించేవారు. వారే ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నాని. ఈ ఇద్దరు మంత్రుల మాటల దూకుడు ఒక రేంజిలో ఉండేది. కొడాలి అయితే బూతుల మంత్రిగా పేరు పొందారు. ఆయన ఎంత వస్తే అంత అన్నట్లుగా మాట్లాడేసేవారు.

జగన్ మీద ఈగ వాలనివ్వను, అది చంద్రబాబు అయినా చినబాబు అయినా సరే. ఇదే నా వార్నింగ్ అని  కొడాలి నాని ఘాటైన కామెంట్స్ చేసిన సందర్భాలు ఈ మూడేళ్ళలో బోలేడు. అలాంటి నాని మాజీ కాగానే నోరు విప్పడం మానేశారు. అప్పటికి జగన్ ఆయన్ని పిలిపించుకుని ఏం మాట్లాడారో తెలియదు కానీ నాని అయితే మీడియా ముందుకు పెద్దగా రావడంలేదు.

అంటే ఆయన నాకు మంత్రి పదవి వెంట్రుకతో సమానం అని బయటకు ఎంత చెప్పినా బాధ అయితే చాలానే ఉంది అని అంటున్నారు. ఇక తమ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా వివక్ష చూపించారు అన్న ఆవేదన కూడా ఉంది అంటున్నారు.

మరో వైపు చూస్తే పేర్ని నాని విషయం ఇలాగే ఉంది. ఆయన కూడా పదవి పోయినందుకు బాధ లేదని చెప్పేశారు. పైగా ఎల్లకాలం తామే మంత్రులుగా ఉండాలా ఏంటి అని చాలా లైట్ తీసుకున్నారు. అయితే నెలన్నరగా చూస్తే ఆయన మాట ఎక్కడా లేదు. ఆయన కూడా సైలెంట్ అయిపోయారు.

ఇక పవన్ కళ్యాణ్ జగన్ మీద ఏమైనా మాట అనడం తడవు పేర్ని నాని మీడియా ముందుకు వచ్చేసి తనదైన శైలిలో పంచులు పేల్చేవారు. అంతే కాదు నాని పేల్చిన సెటైర్లు  ఒక రేంజిలో పేలాలి కూడా. జగన్ మీద ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని కూడా పేర్ని నాని చెప్పుకొచ్చేవారు.

మరి ఈ నెలన్నరలో అటు పవన్ కానీ ఇటు లోకేష్, చంద్రబాబు కానీ గతం కంటే ఎక్కువగా జగన్ని టార్గెట్ చేశారు. అయినా ఇద్దరు నానీలు అయిపూ అజా లేరని అంటున్నారు. అయితే వారు తమ సొంత నియోజకవర్గంలో మాత్రమే చూసుకుంటూ తమ పరిధి మేరకు మాత్రమే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

కానీ మూడేళ్ల పాటు మంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు, పార్టీలో పెద్ద నోర్లున్న వారు కీలక సమయంలో ఇలా మౌన ముద్ర దాల్చడం మంచిదేనా అన్న చర్చ ఉంది. ఇక ఒకమారు కొడాలి నానిని పిలిచి మాట్లాడిన జగన్, పేర్ని నానిని కూడా పిలిచి మాట్లాడుతారు అంటున్నారు. రానున్న రోజుల్లో కూడా నానీల తీరు ఇలాగే ఉంటే మాత్రం వైసీపీ లో రెండు పెద్ద గొంతుకలు లేని లోటు అయితే స్పష్టంగానే ఉంటుంది అంటున్నారు.
Tags:    

Similar News