తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి. ఈ ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలే జరిగినా.. అందర్ని బాగా ఆశ్చర్యానికి గురిచేసిన అంశం.. కూకట్ పల్లిలో ప్రచారానికి ఎన్టీఆర్ రాకపోవడం. సొంత అక్క.. అదీగాక మొదటిసారి ఎన్నికల్లో నిలబడింది… ప్రచారానికి వెళ్లకపోతే ఎలా..? ఇప్పుడిప్పుడే కుటుంబంలో అందరికి దగ్గర అవుతున్నాడు. ఇలాంటి సమయంలో తల పొగరుతో ప్రచారానికి దూరంగా ఉన్నాడు అనే అప్రదిష్ట మూటు కట్టుకోవాల్సి వస్తుంది. అయినా కూడా ప్రచారానికి తారక్ వెళ్లేలేదు. మొదట వెళ్దామని అనుకున్నాడట తారక్. కానీ చివరి నిమిషంలో ఒక అజ్ఞాతవాసి వచ్చి.. కెరీర్ లో ఇప్పుడు స్టార్ గా నిలబడుతున్న వేళ ఎన్నికలకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని చెప్పాడట. దీంతో ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉండి.. చంద్రబాబు మాయలో పడలేదని సమాచారం. మరి ఎన్టీఆర్ కు సలహా ఇచ్చిన ఆ అజ్ఞాతవాసి ఎవరు.
ఆ అజ్ఞాతవాసి ఎవరు అనేదానిపై ఇండస్ట్రీలో రెండు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. అరవింద సమేతతో ఇద్దరి మధ్య బావా బావా లాంటి బాండింగ్ బాగా ఏర్పడింది. అదీగాక.. త్రివిక్రమ్ మాటంటే ఎన్టీఆర్ కు బాగా గురి. ఎందుకంటే త్రివిక్రమ్ పండితుడు. కాస్త జ్యోతిషంపై కూడా పట్టుంది. దీంతో.. రాశిపరంగా - వాసి పరంగా ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడమే మంచిదని చెప్పాడట.
మరోవైపు.. అజ్ఞాతవాసిగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు కూడా విన్పిస్తోంది. ఎన్టీఆర్ - నాని ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ తో సాంబ - అదుర్స్ సినిమాలు తీశాడు నాని. ఆ అనుబంధంతో.. కూకట్ పల్లిలో సీక్రెట్ సర్వే చేయించాడు నాని. ఆ సర్వేలో సుహాసినికి నెగిటివ్‌గా ఉందని విషయం తెలుసుకుని తారక్ ని రావద్దని చెప్పాడట. దీంతో.. ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వెళ్లలేదు. మరి.. తనకి అమూల్యమైన సలహా ఇచ్చింది ఎవరో తెలియాలంటే.. ఎన్టీఆరే చెప్పాలి. ఎన్టీఆర్ ఎప్పటికీ చెప్పడు. ఆ అజ్ఞాతవాసి ఎవరో ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కొన్నిరహస్యాలంటే.. కొందరి గుండెల్లోనే ఉండిపోతాయి.