మంత్రి కొడాలి నాని .. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయాలంటే ఈయనే తర్వాతే ఎవరైనా. మీడియా ముఖంగా ఏ మాత్రం తడబాటులేకుండా ముక్కుసూటిగా సుత్తిలేకుండా మాట్లాడతారు. అయన మాటల్లో ఎంతటి పదును ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరోసారి మంత్రి కొడాలి నాని తన ట్రేడ్‌మార్క్ శైలికి తిరిగి వచ్చారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పై విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఏపీ బీజేపీ, నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో విగ్రహాల చుట్టూ రాజకీయాలు చేయడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి లో బీజేపీ అలాగే దాని మిత్రపక్షం ఘోరంగా ఓడిపోయాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా రాలేదు. తిరుపతి వెంకన్న తిరుపతిలో బిజెపిని గెలిపించలేకపోయారు.అయినా కూడా ఇప్పటికీ వారికి సిగ్గు రావడం లేదని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. నారా లోకేష్ ఓ పెద్ద వెధవ. నారా లోకేష్ కేవలం మంగళగిరి లో మాత్రమే కాదు , రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడి నుండైనా లోకేష్ పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. మొదటగా ఎమ్మెల్యే గా గెలిచి ఆ తర్వాత సవాల్ విసురు అంటూ ఎద్దేవా చేశారు. ఓ ఎమ్మెల్యే గా గెలిస్తే వాడి సోది , సొల్లు మేము వింటాము , ఓ ఎమ్మెల్యేగా గెలవని వెధవ మాటలు నాలాంటి వాడే పట్టించుకోడు , ఇక ఈ సన్నాసి గురించి ముఖ్యమంత్రి పట్టించుకుంటారా? అని అన్నారు.
గణేష్ చతుర్థి వేడుకలపై ప్రభుత్వ ఆంక్షల గురించి వ్యాఖ్యానించిన మంత్రి నాని, కరోనా మహమ్మారి ఉప్పెన కారణంగా ఆంక్షలు అమలులో ఉన్నాయని సమర్థించారు. కోవిడ్ ఆంక్షలపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసిందని, ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో కూడా అదే మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సమూహ కార్యకలాపాలు మరియు వేడుకలు కోవిడ్ పెరుగుదలకు దారితీస్తాయని ఆయన సమర్థించారు. దీనికి ప్రధాన కారణం కరోనా మూడో వేవ్ ముప్పు ఎక్కువగా ఉంది. మొత్తంగా,మంత్రి కొడాలి నాని బిజెపి మరియు నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. చూడాలి మరి మంత్రి మాటలకి బీజేపీ , లోకేష్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో.