ఏపీలో గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు చేసిన రచ్చ తెలిసిందే... ఆ సభాకాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా - కొడాలి నాని వ్యవహారంపై ఏర్పాటైన కమిటీ ఊహించినట్టే నివేదికను సిద్ధం చేసింది. రోజా - నానిల ప్రవర్తన సభలో సరిగ్గా లేదంటూ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నిర్ధారించింది. కమిటీ తుది సమావేశం శుక్రవారం జరిగింది. ప్రవర్తన సరిగా లేని సభ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. తాజా నివేదిక ఆధారంగా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది... కొడాలి నాని పైనా రోజాపై తీసుకున్నట్లే చర్యలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. నివేదికను తొలుత నైతిక విలువల కమిటీకి, అనంతరం ప్రివిలేజ్ కమిటీకి సమర్పిస్తారు. ఆ తరువాత ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు.
అయితే కమిటీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసభ్యపదజాలం వాడినా వారిపై మాత్రం కమిటీ దృష్టి సారించలేదన్న వాదన వినిపిస్తోంది. కేవలం రోజా - కొడాలి నానిపైనే ఫోకస్ పెట్టారని వైసీపీ అభిప్రాయపడుతోంది. కమిటీలో వైసీపీ తరపున సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఈ నివేదికను తీవ్రంగా ఆక్షేపించారు. కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి వీడియోను బయటకు లీక్ అవడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేద్దామని తాను సూచించినా కమిటీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. వైసీపీ సభ్యులను టార్గెట్ చేస్తూ కమిటీ పనిచేసిందని ఆరోపించారు. కమిటీ నివేదికతో విభేదిస్తూ తాను అసమ్మతి లేఖ ఇచ్చినట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. మంత్రులు - అధికార పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మైకు ఇచ్చి, ప్రతిపక్ష నేతను దూషించే విధానానికి స్వస్తి పలికేలా నిబంధనను తాను నివేదికలో పొందుపరచాలని చెప్పినా వినలేదన్నారు. కాగా బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీలో టీడీపీ నుంచి శ్రావణ్ కుమార్ - బీజేపీ నుంచి విష్ణుకుమార్ రావు, వైసీపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. కమిటీలో మిత్రపక్షమైన బీజేపీ సభ్యులతో చూస్తే అధికారపక్షానిదే పైచేయి. అందుకే శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేశారు.
అయితే.. కమిటీ నివేదిక ప్రకారం నానిపై చర్య తీసుకుంటారా... శ్రీకాంత్ రెడ్డి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారా అన్నది చూడాలి. కమిటీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్నే లెక్కిస్తే దాని సిఫార్సుల ఆధారంగా నానిపై వేటు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఆనాటి సభలో నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు - మంత్రి అచ్చెన్నాయుడిని దూషించిన వీడియోలు ఇప్పటికే యూట్యూబ్ - సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
''అచ్చెన్నాయుడు సొల్లు సైకోగాడు - బుద్ధిలేదు - ఎద్దులా పెరిగాడు - కుక్కలాగా మొరుగుతాడు, చంద్రబాబు సన్నాసి - ఎన్టీఆర్ నే చంపినవాడు'' అంటూ ఏపీ అసెంబ్లీ అచ్చెన్నాయుడిని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని అసెంబ్లీలో స్పీకర్ ఎదురుగా చేసిన దూషణల వీడియో ఇక్కడ చూడొచ్చు.
Full View