వైఎస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని పీఏ లక్ష్మోజీ తనను వేధిస్తున్నారని గుడివాడకు చెందిన వార్డు ఎస్సీ వలంటీర్ మెరుగు లలిత ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎస్సీ కమిషన్ చైర్మన్‌తో పాటు పలువురికి ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెరుగు లలిత గుడివాడ సీఐపై, కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై హాట్ కామెంట్స్ చేశారు. వివరాలు మెరుగు లలిత మాటల్లోనే... "గుడివాడ బాపూజీనగర్‌లోని 13వ వార్డులో నివాసముంటున్నాం.
మున్సిపాలిటీ స్థలంలో మాకు ఇల్లు ఉంది. కొట్టుడు చేతిపంపు వేసుకుందామని సామాన్లు తెచ్చుకున్నా. రావి రమేష్, రమేష్ వాళ్ల మామ, సురేష్, రావి రమాదేవి, వాళ్ల చెల్లెలు.. వీళ్లంతా నాపై దౌర్జన్యం చేసి నన్ను కొట్టారు. నా పరదాలన్నీ పీకేశారు. నన్ను చాలా నీచాతినీచంగా నానా మాటలు అన్నారు. నన్ను కొట్టి చేయి విరగ్గొట్టారు. దీంతో చెయ్యి బెండొచ్చి.. వాచిపోయింది.
దీంతో నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లాను. ఔట్‌పోస్టులో ఉన్నవాళ్ల ఏం జరిగిందని అని అడిగితే జరిగిన విషయం వాళ్లతో చెప్పాను. ఎక్స్‌రే తీసి ఇంజెక్షన్ చేశారు. సీఐ దగ్గరకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పెద్ద పెద్ద వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ముందు బయటకు పో.. పెద్ద వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని నన్ను తిట్టారు. అది కాదు సార్.. పెద్ద వాళ్లు ఎవరో చెప్పండి అంటే దణ్ణం పెట్టి వెటకారంగా బయటకు పొమ్మన్నారు. పంపు వేసుకునేందుకు ప్రయత్నిస్తే కొడాలి నాని పీఏ బంధువులు అడ్డంకులు సృష్టిస్తున్నారు" అని మెరుగు లలిత ఆవేదన వ్యక్తం చేశారు.
"నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే సీఐ పంపు వేసే పనులను ఆపేయాలని ఆదేశించారు. పంపు వేయకపోవడం ఆపకపోతే నాపైన కేసు పెడతానని బెదిరించారు. కొడాలి నానీ పీఏ లక్ష్మోజీకి చెప్పడానికి వెళ్లగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. లక్ష్మోజీ తన బంధువులకు అండగా నిలుస్తున్నారు. నన్ను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయకపోతే, నేను ఆత్మహత్య చేసుకుంటాను" అని ఎస్సీ వలంటీర్ మెరుగ లలిత ఆవేదన వ్యక్తం చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.