వైసీపీ కొత్త మంత్రి వర్గం ఫైనల్ లిస్ట్ రెడీ అయింది. అందులో చూస్తే గత క్యాబినెట్ లో పనిచేసిన ముగ్గురు నానీలు అవుట్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ళ నాని, ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నాని పేర్లు గల్లంతు అయ్యాయి. ఇందులో ముందే ఆళ్ళ నానికి పదవి దక్కదు అని తేలిపోయినా చివరి దాకా వినిపిచిన పేర్లు మాత్రం కొడాలి నాని, పేర్ని నావివి కావడం విశేషం.
మరీ ముఖ్యంగా కొడాలి నాని టీడీపీకి ఎదురు నిలిచే నేత. పార్టీ వాయిస్ ని ఎపుడూ బలంగా వినిపించే నేత కావడం, కమ్మ సామాజికవర్గం నుంచి ఆయన ఒక్కరే గత మంత్రివర్గంలో ఉండడంతో ఆయన పేరు మరో మారు కచ్చితంగా లిస్ట్ లో ఉంటుందని అంతా భావించారు.
కానీ కొడాలి నాని పేరుని చివరి నిముషంలో తప్పించారని తెలుస్తోంది. దాంతో ఆయన అభిమానులు, అనుచరులు పూర్తిగా డీలా పడ్డ పరిస్థితి. ఇక పేర్ని నాని విషయం తీసుకుంటే ఆయన కూడా జగన్ కి విధేయత చూపారు. పార్టీ మీద ఈక వాలినా జగన్ మీద ఒక్క విమర్శ వచ్చినా గట్టిగా నిలిచి మీడియా ముందు పోరాడేవారు. అయితే ఇపుడు ఆయన పేరు కూడా లిస్ట్ లో కనిపించకపోవడం విశేషం. మొత్తానికి జగన్ తొలి క్యాబినెట్ లో పనిచేసిన ముగ్గురు నానీలు ఈసారి అవుట్ కావడం అరుదైన ఘటనగానే చూడాలి అంటున్నారు.