ఏపీలో ఒకవైపు వైరస్ విజృంభణ కొనసాగుతుంటే ..మరోవైపు రాజకీయం కూడా అదే లెవెల్ లో వేడెక్కుతుంది. ఈ మధ్య ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి హైకోర్టులో అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాజాగా నిమ్మగడ్డ రమేష్ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోను రద్దు చేస్తునట్టు హైకోర్టు ప్రకటిస్తూ ఎస్ఈసీగా నిమ్మగడ్డ కొనసాగుతారని తెలిపింది.
దీనిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ ..సీఈసీ రమేశ్ టీడీపీ కనుసన్నలలోనే నడుస్తాడన్న విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు వచ్చినా ప్రజల కోసం అనుకున్న పని చేసి తీరుతామని అన్నారు. రమేష్ కుమార్ మళ్ళీ ఎస్ఈసీగా వచ్చినా చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా పీకలేరని, కింది కోర్టులో న్యాయం జరగకపోతే పైకోర్టుకు వెళ్తామని చెప్పారు.
గుడివాడ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని. గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే జగన్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తోందని అన్నారు. అలాగే , టీడీపీ పేరు తీసి సీబీఎన్ లేదా చంద్రబాబు ఖర్జుర నాయుడు అని పేరుపెట్టుకోవాలని కీలక వ్యాఖ్యలు చేసారు మంత్రి కొడాలి నాని.