కొడ‌నాడు అమ్మ ఎస్టేట్ లోప‌ల అలా ఉంద‌ట‌

Update: 2017-05-05 04:46 GMT
అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఆమెకు చెందిన ఆస్తుల విష‌యంలో త‌ర‌చూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కొడ‌నాడులోని అమ్మ ఎస్టేట్ లో ఇటీవ‌ల దొంగ‌త‌నం జ‌ర‌గ‌టం.. ఈ సంద‌ర్భంగా ఒక గూర్ఖాను దోపిడీదారులు హ‌త్య చేయ‌టం.. మ‌రొక‌రిని తీవ్రంగా గాయ‌ప‌ర్చిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతాన్నిసీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు.. ఈ దోపిడీకి పాల్ప‌డిన వారిని అదుపులోకి తీసుకునేందుకు మూడో క‌న్ను తెరిచారు. ఈ నేప‌థ్యంలో.. దోపిడీకి పాల్ప‌డిన కొంద‌రిని త‌మిళ‌నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమ్మ ఎస్టేట్ లో దోపిడీకి సంబంధించి నిందితులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. వారు చెబుతున్న విష‌యాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. కొడ‌నాడు ఎస్టేట్ లోకి ప్ర‌వేశించిన త‌మ‌కు.. అక్క‌డ క‌నిపించిన సంప‌ద‌ను చూస్తే అలీబాబా గుహ‌ను త‌ల‌పించింద‌ని.. ఎస్టేట్ లో జ‌య‌ల‌లిత‌.. శ‌శిక‌ళ గ‌దుల్లో భారీ ఎత్తున బంగారం.. క‌రెన్సీ క‌ట్ట‌లతో పాటు.. భారీ ఆస్తులు.. స్థ‌లాల కాగితాలు క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా క‌ట్టి ప‌డేసిన‌ట్లుగా ఉన్న‌ట్లుగా దోపిడీ దొంగ‌లు చెబుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

దోపిడీకి పాల్ప‌డిన వారిలో ఇద్ద‌రు అమ్మ‌కు గ‌తంలో డ్రైవ‌ర్లుగా ప‌ని చేసిన వారు ఉండ‌టం గ‌మ‌నార్హం. దోపిడీకి స్కెచ్ అస‌లు వ్య‌క్తులు బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. దోపిడీలో కీల‌క పాత్ర పోషించిన వారు మాత్రం.. ఇద్ద‌రు డ్రైవ‌ర్ల‌కు రెండు ల‌క్ష‌లు ఇచ్చి.. ఈ విష‌యంలో పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయ‌ని.. హ‌ద్దు మీరి డ‌బ్బులు అడిగితే మీకే ముప్పు అని వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దోపిడీకి ముందు ఒక మాజీ మంత్రి ఇంట్లో దోపిడీదారులు టీ తాగిన‌ట్లుగా వారు పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీసుల‌కు ల‌భించిన‌ట్లుగా తెలుస్తోంది.

అమ్మ మాజీ డ్రైవ‌ర్ క‌న‌క‌రాజ్ దోపిడీని ముందు ఉండి న‌డిపించిన‌ట్లుగా నిందితులు అలీ.. జిత్త‌న్ జాయ్ లు వెల్ల‌డించారు. దోపిడీ విష‌యంలో పెద్ద త‌ల‌కాయ‌లుఉన్న‌ట్లుగా నోరుజారిన క‌న‌క‌రాజ్ కొద్దిరోజుల‌కే అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించ‌టం గ‌మ‌నార్హం. మ‌రో డ్రైవ‌ర్ అలీ ప్ర‌స్తుతం రోడ్డు యాక్సిడెంట్లో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్నారు.

కొడ‌నాడు ఎస్టేట్ లో దోపిడీకి త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని వాచ్ మెన్ ఓం బ‌హ‌దూరు.. కృష్ణ బ‌హ‌దూర్‌ ను కోరామ‌ని.. అయినా వారు ఒప్పుకోలేద‌ని నిందితులు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఎంత డ‌బ్బు ఇస్తామ‌న్నా వారు ఒప్పుకోలేద‌ని.. బంగ్లాలోకి వెళ్ల‌నీయ‌కుండా ఆడ్డుకొన్నార‌ని.. అందుకే.. వారిని బ‌లంగా గాయ‌ప‌రిచి లోప‌ల‌కు ప్ర‌వేశించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

లోప‌ల జ‌య‌ల‌లిత‌.. శ‌శిక‌ళ గ‌దుల్లో ఉన్న పెద్ద పెద్ద సూట్‌కేసులు తెర‌వ‌గా.. అక్క‌డున్న క‌రెన్సీ క‌ట్ట‌లు.. ఆస్తి ప‌త్రాలు.. ఆభ‌ర‌ణాలు భారీగా క‌నిపించాయ‌ని.. చేతికందిన వ‌ర‌కూ నోట్ల క‌ట్ట‌ల్ని.. న‌గ‌ల్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుకొన్న త‌ర్వాత క‌న‌క‌రాజ్ త‌మ‌కు రెండు ల‌క్ష‌లు ఇచ్చి.. ఈ విష‌యంలో ఎక్కువ‌గా క‌లుగ‌జేసుకుంటే పెద్ద‌త‌ల‌కాయ‌ల‌తో మీకే ముప్పు అని బెదిరించాడ‌ని.. అందుకే మౌనంగా అత‌డిచ్చిన మొత్తాన‌న్ని తీసుకొని.. కేర‌ళ‌కు వెళ్లిపోయిన‌ట్లుగా నిందితులు పేర్కొన్నారు. దోపిడీకి పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్న‌ట్లుగా నిందితులు చెబుతున్న నేప‌థ్యంలో.. వారెవ‌రు? అన్న‌ది ఇప్పుడు పెద్ద‌ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News