మహాకూటమిలో మళ్లీ ముసలం మొదలైంది. మహా కూటమి సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ ఇస్తామన్న 8 స్థానాల్లో కాకుండా 12స్థానాల్లో తాము పోటీ చేస్తామని కోదండరాం ప్రకటించారు. కాగా ఆసిఫాబాద్ స్థానానికి ఆత్రం సక్కు - స్టేషన్ ఘన్ పూర్ స్థానానికి ఇందిరను తమ అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. అటు మహబూబ్ నగర్ స్థానానికి తమ అభ్యర్థిగా ఎర్రశేఖర్ ను టీడీపీ కూడా ప్రకటించింది. అంతేకాదు ఆయా స్థానాలను కూడా ప్రకటించడంతో.. తాము ప్రకటించిన స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకోవాలని కోదండరాం అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. కాగా ఆసిఫాబాద్ స్థానానికి ఆత్రం సక్కు - స్టేషన్ ఘన్ పూర్ స్థానానికి ఇందిరను తమ అభ్యర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. అటు మహబూబ్ నగర్ స్థానానికి తమ అభ్యర్థిగా ఎర్రశేఖర్ ను టీడీపీ కూడా ప్రకటించింది.దీనికి తోడుగా స్వయంగా తానే జనగామ నుంచి బరిలోకి దిగాలని కోదండరాం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.
పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఇస్తామన్న 8సీట్లకు టీజేఎస్ అంగీకారం తెలిపింది. అయితే ఆ 8 స్థానాలు ఏవేవి అన్నది ఇంతవరకు కాంగ్రెస్ తేల్చలేదు. కాంగ్రెస్ చేస్తున్న తీవ్ర జాప్యంతో విసిగిపోయిన టీజేఎస్ ఎదురుతిరిగినట్టు కనిపిస్తోంది. 8 కాదు మొత్తం 12 స్థానాల్లో మేము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించింది. పొత్తులో భాగంగా వర్ధన్నపేట - దుబ్బాక - మెదక్ - మల్కాజ్ గిరి - అంబర్ పేట - వరంగల్ ఈస్ట్ - సిద్ధిపేట - జనగామ స్థానాలకు టీజేఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. అయితే 9వ స్థానంగా మిర్యాలగూడ తమకు కేటాయించాలని టీజేఎస్ ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ స్థానాలు కూడా అదనంగా ఆసిఫాబాద్ - స్టేషన్ ఘన్ పూర్ - మహబూబ్ నగర్ స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం మహాకూటమిలో కలకలం రేపింది. ఈ మూడు స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ - టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించినా.. ఆ స్థానాల్లో తాము పోటీ చేస్తామని టీజేఎస్ ప్రకటించడం కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటివరకు అంతా సవ్యంగా సాగుతుంది అని అనుకుంటున్న సమయంలో కోదండరాం తీసుకున్న నిర్ణయంతో మహాకూటమిలో ఒక్కసారిగా కలకలం రేపింది. అనూహ్యంగా తెలంగాణ జనసమితి రూటు మార్చడం చర్చనీయాంశంగా మారింది.మొత్తంగా టీజేఎస్ చూసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. మహాకూటమి నుంచి జనసమితి బయటకు వస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
టీజేఎస్ ప్రకటించిన 12 స్థానాలు..
నెంబర్ నియోజకవర్గం
1 వర్ధన్నపేట
2 దుబ్బాక
3 మెదక్
4 మల్కాజ్ గిరి
5 అంబర్ పేట
6 వరంగల్ ఈస్ట్
7 సిద్ధిపేట
8 జనగామ
9 మిర్యాలగూడ
10 ఆసిఫాబాద్
11 స్టేషన్ ఘన్ పూర్
12 మహబూబ్ నగర్