టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొంగరకలాన్ లో చేపట్టిన ప్రగతి నివేదన సభపై డివైడ్ టాక్ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రగతి నివేదన సభపై ఆయా పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తుండగా... తాజాగా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ సభ గులాబి గర్జన సాగుతుందని ప్రజలు ఆశిస్తే వెలవెలబోయిందని విమర్శించారు. 25 లక్షల మంది వస్తారని - ముఖ్య ప్రకటనలు చేస్తారనుకున్నారు. ఏదో జరిగిపోతుందని ఆశించారు. నివేదన సభకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించినా నాలుగో వంతు జనం కూడా సభకు రాలేదని అన్నారు. సభకు ఉపాది కూలీలలో పాటు అన్ని రకాల వారిని తరలించడానికి అధికారులు ప్రయత్నం చేశారని ఆరోపించారు. జనం విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి ఏంజాయి చేసిపోయారు. ప్రగతి నివేదన సభ కాస్త...`పదవీ విరమణ సభ`గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రగతి నివేదన సభ కొండత రాగం తీసి కేసీఆర్ పాట పడినట్టుగా మారిందని.. ఆకాశమంతా ఆర్భాటంతో ప్రచారం చేసినా ప్రజలు కేసీఆర్ చెంపపెట్టు లాంటి సమాధాం చెప్పారని కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో మాటల తడబడ్డాయని - మాటలు వెతుక్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో సజీవ సంబందాలు లేకపోవటం వల్లనే మాటలు రాలేదని విమర్శించారు. ఒంటి స్థంబంలో మేడలో నివసించే రాజకుమారుడిలా సీఎం కనిపించారని వ్యాఖ్యానించారు. ప్రజలకు దూరమై అధికారాన్ని సొంత ఆస్తిలా బావించి సీఎం రాజకీయంగా - ప్రభుత్వపరంగా తన విధానం చెప్పుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. దీపం ఆరిపోయే ముందు ఆఖరి తేజంలా కేసీఆర్ కనిపించారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి - వస్తు రవాణాకు వాడే ట్రాక్టర్లలో ప్రజలను తరలించడం నిబంధనలకు విరుద్దమని అన్నారు. ప్రగతి నివేదన సభతో మైక్ టైసన్ లాగా గెలిస్తారని అనుకుంటే మొదటి రౌండ్ లోనే కేసీఆర్ ఎలిమినేట్ అయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రసంగం సైతం ఓటమిని చవిచూసినట్టు పేలవంగా సాగిందన్నారు. సభతో టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు భరోసా కూడా ఇవ్వలేకపోయారన్నారు. అది పదవి విరమణ సభలాగా సాగిందన్నారు. తమ పార్టీ 25 నియోజక వర్గాల్లో కార్యాచరణ సిద్దం చేస్తోందని - ఇంటింటికి జన సమితి అనే ప్రచారం మొదలు పెడుతున్నట్టు కోదండరాం చెప్పారు.