కొన్ని కొన్ని సంప్రదాయాలు ఏ మాత్రం మంచివి కావు. తమ ప్రయోజనాల కోసం తెర మీదకు తీసుకొచ్చే వాదనలు తర్వాతి కాలంలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్న విషయం తాజాగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు బాగానే అర్థమై ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఏదైతే పెంచి పోషించామో.. అదే సంస్కృతి ఇప్పుడు తమపై దాడికి కారణంగా మారటం మాష్టారికి ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే.. ఆ మాటలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలని.. ఇలాంటి మాటలు తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీస్తాయన్న వాదనను తెర మీద తీసుకురావటమే కాదు.. నోరు విప్పేందుకు సైతం భయపడే పరిస్థితిని తీసుకురావటంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం సక్సెస్ అయ్యారు. ఉద్యమ కాలంలో వర్క్ వుట్ అయిన విధానాల్ని తర్వాతి కాలంలో అమలు చేసేందుకు కేసీఆర్ అండ్ కో ప్రయత్నం చేయట కోదండరాం లాంటి అసలుసిసలు ఉద్యమకారులకు ఇబ్బందికరంగా మారింది.
పుస్తకాల్లో కనిపించే సిద్ధాంతాలకు.. ఉద్యమకారులు తరచూ ఆవిష్కరించే స్వప్నాలకు భిన్నంగా రాజకీయం ఉంటుంది. ఈ విషయం తెలీనంత అమాయకుడేమీ కాదు కోదండం మాష్టారు. అయితే.. మిగిలిన వారి కంటే భిన్నంగా ఉద్యమాల్ని నడిపిన సత్తా సొంతమైన తమ లాంటి వారికి సాధ్యం కానిది ఏమీ ఉండదన్న ఒక నమ్మకం ఉంటుంది. అదే.. వారిని నడిపిస్తూ ఉంటుంది. అదే.. ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా నిలుపుతోంది. అందరి మాదిరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా మారిపోతే.. ఈ రోజు ఆయన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక స్థానంలో ఉండి ఉండేవారు. కానీ.. అలాంటి తీరు ఆయనకు ఏ మాత్రం నచ్చనిది.
తమ ప్రజల కోసం.. వారి బాగు కోసం ప్రయత్నించటం.. భ్రష్టు పట్టిన వ్యవస్థల్ని పూర్తిగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కోదండం లాంటి అసలుసిసలు ఉద్యమకారులకు రాజకీయ పదవుల్ని చేపట్టటం కన్నా.. ఉద్యమకారులుగా ఉండటానికే ఇష్టపడతారు. అందుకే.. ఆయన కేసీఆర్ కు విధేయుడిగా మారలేదు సరికదా.. ఒకనాటి తన మెంటర్ మీదనే పోరాడేందుకు రెఢీ అవుతున్నారు.
ఇలాంటివి తన రాజకీయ జీవితంలో ఎన్నో చూసిన కేసీఆర్.. కోదండరాంకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు షూరూ చేయటం తెలిసిందే. దారులు వేరైన ఈ పాత మిత్రులు.. ఇప్పుడు విధానాల విషయంలో పోరాటం చేసుకునే పరిస్థితి. కర్కసమైన రాజకీయాలకు బంధాలు.. అనుబంధాలు లాంటివేమీ ఉండవన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మొన్నటికి మొన్న ఇరిగేషన్ నిపుణుడిగా పేరొందిన విద్యాసాగర్ లాంటి మేధావి కోదండరాం మీద విరుచుకుపడటమే నిదర్శనం. ప్రతి విషయం మీద అరకొర అవగాహనతో మాట్లాడకూడదంటూ కోదండం మాష్టారి మీద విరుచుకుపడటమే కాదు.. ఇలా తరచూ విమర్శలు చేయటం అంటే.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవటమే అంటూ మండిపడ్డారు. ఉద్యమకాలంలో తామేం చెప్పామో.. ఇప్పుడు అవే మాటల్ని కోదండంరాం వినాల్సి రావటానికి మించిన చిత్రమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది. అందుకే అంటారు.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని.