కలిసి ఉద్యమం చేసిన కేసీఆర్.. కోదండరాం లాంటి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలు కావటం తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచేసింది. ఇప్పటివరకూ కేసీఆర్ కు ప్రత్యర్థులంతా ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు కాదు. ఉమ్మడిగా వ్యూహాలు రచించిన వారు కాదు. అందుకే ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారన్న విషయంపై అవగాహన తక్కువ. కానీ.. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ అయిన కోదండరాం వ్యవహారం అందుకు పూర్తి భిన్నం. ఆయనకు కేసీఆర్ ప్లస్ లు. మైనస్ లు అన్ని తెలుసు. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారన్న విషయం దగ్గర నుంచి.. ఏ విషయంలో ఆయన దూకుడుగా ఉంటారో.. ఏ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తారన్న విషయం మీద అవగాహన ఉంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. కేసీఆర్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో కోదండరాంకు బాగా తెలుసు.
ఇప్పుడు అలాంటి వ్యక్తే కేసీఆర్ కు రాజకీయ ప్రత్యర్థిగా మారనున్నారు. రాజకీయ పార్టీలన్నీ కేసీఆర్ ను తట్టుకోలేక చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో.. ఎంట్రీ ఇచ్చిన కోదండరాం తొలి అడుగులోనే కేసీఆర్ మీద స్పష్టమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కేసీఆర్ సర్కారుపై కోదండరాం విమర్శలు చేయటం.. దానికి ప్రతిగా తెలంగాణ అధికారపక్షం నుంచి తీవ్రస్థాయిలో ఎదురుదాడి మొదలుకావటం జరిగిపోయాయి. అయితే.. కోదండరాం మీద తెలంగాణ అధికారపక్ష నేతలు విమర్శలు చేయటంపై తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమైందన్న ఫీడ్ బ్యాక్ టీఆర్ ఎస్ శ్రేణులకు షాకింగ్ గా మారింది.
దీంతో.. కోదండరాం మీద ఆవేశంతో విరుచుకుపడితే నష్టపోయేది తామేనన్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ అధికారపక్షం కామ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. కోదండరాం మాత్రం తానేం చేయాలనుకున్నానో అది చేస్తూ ముందుకు వెళుతున్నారు. తొలుత కేసీఆర్ సర్కారు పని తీరుపై విమర్శలు చేసిన ఆయన కలకలం రేపగా.. అనంతరం జేఏసీ సమావేశం నిర్వహించి.. పలు కార్యక్రమాలు.. సభలకు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించారు. కోదండరాం గేమ్ ప్లాన్ అర్థం కావాలంటే.. ఆయన భవిష్యత్ కార్యాచరణను పరిశీలిస్తే ఇట్టే తెలుస్తుంది. విద్యార్థులు.. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అంశాలపై ఆయన ఫోకస్ చేస్తున్నారు. తాజాగా ఆయన వర్సిటీల గురించి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం గాలికి వదిలేసిందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకూ వీసీల్ని నియమించలేదంటూ సమస్యల చిట్టా విప్పారు. అంతేకాదు.. ఉస్మానియాకు కీలకమైన న్యాక్ గుర్తింపు రద్దు కావటం కారణంగా యూజీసీ నుంచి వచ్చే నిధులు రావటం లేదన్న ఆయన.. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులే తనను మాట్లాడిస్తున్నాయంటూ ఎలా మాట్లాడితే సూటిగా తగులుతుందో అలానే మాట్లాడుతున్నారని చెప్పాలి.
రాజకీయ అంశాలు కాకుండా విద్యార్థుల జీవితాల్ని ప్రభావితం చేసే అంశాల మీద ఉద్యమం అంటే.. విద్యార్థులంతా ఆయన వెంట నడిచి వచ్చే పరిస్థితి. తనకు బలం ఉన్న చోటనే కోదండరాం మొదటి అడుగు వేయటం చూస్తే.. ఇది తొలి అడుగే తప్పించి చివరి ఆడుగు కాదన్న విషయం అర్థం కాక మానదు. తనకు పూర్తిస్థాయి పట్టున్న విద్యార్థులతో కలిసి.. విద్యా సంబంధమైన అంశాల మీద పోరాటం చేయటం కేసీఆర్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి. తన గేమ్ ప్లాన్ మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న కోదండరాంకు కేసీఆర్ ఎలా చెక్ పెడతారో చూడాలి.