తెలంగాణ జన సమితి పేరుతో రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కోదండరాంను కాంగ్రెస్ పార్టీ ఓ పావులా వాడుకుందా? టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలన్న ఆవేశంలో కూటమిలో చేరిన ఆయన నిండా మునిగిన తర్వాత కానీ తత్వం బోధపడలేదా? సీట్ల పంపకాలు తేలితే కానీ…కోదండరాంకు తాను చేసిన తప్పిదం అర్థం కాలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను చూసి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి 8 సీట్లు ఇస్తామన్నారని - కానీ 6 సీట్లు మాత్రమే ఇచ్చారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సీట్ల సర్థుబాటు సరిగా జరగలేదని కోదండరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులు ఉన్న చోట.. కాంగ్రెస్ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నామని తన బేలతనాన్ని చాటుకున్నారు.
టీజేఎస్ పెట్టిన ఆరంభంలో ఎన్నో సార్లు రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు..! కానీ టీఆర్ ఎస్ మీదున్న కసితో గుడ్డిగా కాంగ్రెస్ పార్టీని నమ్మి కూటమిలో చేరారు..! తర్వాత పార్టీలో అనుచరులు - ముఖ్య నేతల సంగతి పక్కనపెడితే… కనీసం తనకు కూడా టిక్కెట్ దక్కించుకోలేకపోయారు..! ఫలితంగా చక్రం తిప్పాలనుకున్న కోదండరాం కూటమిలో కరివేపాకుగా మారిపోయారు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన పరోక్షంగా అంగీకరించారు. మహాకూటమికి నష్టం లేకపోతేనే తాను జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నానని పేర్కొన్నారు. అందర్నీ ఒప్పించే పరిస్థితి ఉంటేనే.. జనగామ సీటు ఇవ్వమన్నానని కోరానని, అయితే, అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతే అభ్యంతరం తెలిపారని ఆయన వాపోయారు. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నామని పేర్కొంటూ తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను పెట్టారని తెలిపారు. ఆర్. కృష్ణయ్యను పోటీలో పెడ్తారని తమకు తెలియదని..కూటమిలో తన పాత్ర ఎంత నామమాత్రమో కోదండరాం చెప్పకనే చెప్పేశారు.
తమకిచ్చే సీట్లకు అదనంగా ఒక్క సీటును ఓల్డ్ సిటీలో అదనంగా కోరామని పేర్కొంటూ అదీ దక్కలేదని కోదండరాం అసంతృఫ్తి వ్యక్తం చేశారు. సరైన పద్దతుల్లో సీట్ల సర్థుబాటు జరగలేదని వాపోయారు. తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి సహజంగానే ఉంటుందన్నారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు మాట్లాడలేనని తద్వారా తాను ఒత్తిడి చేయలేని స్థితిలో ఉన్నాననే తీరును చెప్పకనే చెప్పేశారు.