తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చికాకు పుట్టిస్తున్నవారిలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండం మాష్టారు ముందుండారనటంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జేఏసీ కేసీఆర్ మానసపుత్రిక అని ఎవరైనా అంటే.. ఉద్యమ కాలంలో తప్పు పట్టేవారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయటానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడేవారు. కానీ.. తెలంగాణ రాజకీయ జేఏసీకి కర్త.. కర్మ.. క్రియ మొత్తం కేసీఆరేనని.. ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తే కోదండరాం అని కొందరు చెప్పినా.. చాలామంది నమ్మే వారు కాదు.
కాలం ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. అధికారపక్షంగా ఉద్యమ పార్టీ అయిన టీఆర్ ఎస్ పవర్ లోకి వచ్చిన వేళ.. వారి విధానాల్ని తప్పుపడుతున్న కోదండరాంపై తాజాగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో జేఏసీని ఏర్పాటు చేసింది.. దానికి ఛైర్మన్ గా కోదండరాం మాష్టారిని నియమించింది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. కారణాలు ఏమైనా.. దూరం పెరిగిందని చెప్పిన ఆయన.. ఎక్కడ టెంటు కనిపిస్తే అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. ఈ విధానాన్ని విడిచిపెట్టాలంటూ తనదైన ధోరణిలో చెప్పుకొచ్చారు కేటీఆర్.
ఈ ఇంటర్వ్యూను చూసిన వారంతా కేటీఆర్ మాటలకు కాసింత అవాక్కు అయ్యే పరిస్థితి. ఓపెన్ గా తాను చెప్పాలనుకున్నది ఎంతలా చెప్పేశారని కేటీఆర్ మాటలకు ఆశ్చర్యపోయినోళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వేళ కోందండరాం మాష్టారు ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తి కూడా వ్యక్తమైంది. అయితే.. ఇలాంటివేమీ తనకు పట్టవన్నట్లుగా కోదండరాం మాష్టారు తనదైన శైలిలో వెళ్లిపోతున్నారు. తాజాగా భూనిర్వాసితుల సదస్సుకు హాజరైన కోదండరాం మాష్టారు మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏ తీరులో అయితే సమిష్టిగా పోరాడామో.. ఇప్పుడు అదే విధంగా అందరం కలిసి పోరాడితే.. భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన వారి కష్టాలపై అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్న మాష్టారి మాటల్లో మర్మం అర్థమైందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/