కోదండం మాష్టారు కేసీఆర్ గురించి చెప్పారు

Update: 2016-06-08 07:30 GMT
అంతా బాగున్నప్పుడు చాలానే విషయాలు బయటకు రావు. కానీ.. లెక్క తేడా వచ్చినప్పుడే అసలు విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. తెలంగాణ సర్కారు తీరుపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అసంతృప్తి వ్యక్తం చేయటం.. ఆయన తీరుపై తెలంగాణ అధికారపక్ష నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడటం తెలిసిందే. కోదండరాం మీద తెలంగాణ అధికారపక్ష నేత మాటల దాడి మీద వేడి చల్లారక ముందే.. మరో సంచలన విషయాన్ని కోదండరాం స్వయంగా చెప్పారు. తనకు జరిగిన అవమానాల గురించి ఇప్పటివరకూ పల్లెత్తు మాట కూడా బయటకు చెప్పని ఆయన ఇప్పుడు గతానికి సంబంధించిన విషయాలు బయటపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

ఒక టీవీ ఛానల్ తో మాట్లాడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించానని.. కానీ తనకు అపాయింట్ మెంట్ లభించలేదని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తీసుకునే నిర్ణయాల్ని ఇప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయానికి తాము పంపుతున్నామని.. అయినా మంత్రులు తనను ఎందుకు విమర్శిస్తున్నది అర్థం కావటం లేదని చెప్పుకొచ్చారు.

తనను కలవాలని ప్రయత్నించిన విపక్ష నేతలకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా షాకిచ్చిన కేసీఆర్.. చివరకు తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన కోదండరాంకు కూడా తనదైన శైలిలో షాకిచ్చారన్న నిజం బయటకు రావటం చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని ఆసక్తికర విషయాల్ని మాష్టారు చెబుతారో అనిపించక మానదు.
Tags:    

Similar News