ఆచితూచి మాట్లాడినట్లుగా వ్యవహరించే టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నోటి వెంట తాజాగా సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనన్నారు. కరీంనగర్ లో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కోదండం మాష్టార్ని పవన్ గురించి మాట్లాడాలని ప్రశ్నించగా.. పవన్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనని వ్యాఖ్యానించటం గమనార్హం.
తెలంగాణ ఉద్యమకారుల్ని పక్కన నెట్టేసి ద్రోహుల్ని తన దగ్గరకు చేర్చుకున్న ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమైందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఉన్న వనరులతో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు మాత్రం ఆంధ్రా వాళ్లకు లాభం చేసేలా ఉన్నాయన్నారు.
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా టీజేఏసీ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పిన ఆయన.. పవన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థాయిల గురించి మాట్లాడే కోదండం మాష్టారికి ఏ స్థాయి ఉందని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యకర రాజకీయాలు చేస్తానని పవన్ చెబుతూ ఎవరిని తొందరపడి అనుచితంగా మాట్లాడనని చెబుతున్నా.. అందుకు భిన్నంగా కోదండం మాష్టారి స్పందన ఉన్నట్లుగా చెబుతున్నారు.
తొందరపడి మాట తూలే అలవాటు లేని కోదండం మాష్టారు.. పవన్ విషయంలో రియాక్ట్ అయిన తీరుచూస్తే.. పవన్ కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి అకారణంగా లాభం చేకూరుతుందన్న ఫస్ట్రేషన్లోనే ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పవన్ పై కోదండం మాష్టారి వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి.. దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.