మాట్లాడకుండా ఉండలేడు! ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేడు! కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయలేడు! మరొక ఉద్యమం చేయాల్సిందేనని ప్రజా సంఘాల సమావేశాల్లో వ్యాఖ్యానించకుండా ఉండలేడు. ఇంత విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామిరెడ్డిది. తెలంగాణ వచ్చే వరకూ కోదండను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకున్న కేసీఆర్.. తెలంగాణ వచ్చిన వెంటనే ఆయనను కరివేపాకు చేశారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయినా, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి కోదండదని వివరిస్తున్నారు.
వాస్తవానికి, తనను దగ్గరకు రానివ్వకపోయినా, పక్కనపెట్టినా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి కోదండ సాహసించడం లేదని, అదే సమయంలో కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన సమర్థించలేకపోతున్నారని ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ తాజా వ్యాఖ్యలని కూడా స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఏవీ రావనే విషయాన్ని నిరుద్యోగులకు చెప్పి వారిని కార్యోన్ముఖులను చేయాలని కోదండకు ఉందని, కానీ ఆ విషయాన్ని ఆయన నేరుగా చెప్పలేరని, అందుకే గ్రూప్స్‌కే పరిమితం కావద్దని, బ్యాంకులు, రైల్వేలు వంటి ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని, వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారని అంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి జీతభత్యాల వ్యయాన్ని భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికిప్పుడే నోటిఫికేసన్ ఇచ్చే అవకాశం లేదని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి. అందుకే నోటిపికేషన్ ఇవ్వాలని తాను, హరగోపాల్ కోరుకుంటున్నామని కోదండ వ్యాఖ్యానించారని, నోటిపికేషన్లు ఇవ్వకపోతే అశాంతి నెలకొంటుందంటూ సర్కారుకు హెచ్చరిక సంకేతాలు కూడా పంపారని విశ్లేషిస్తున్నాయి.