టీడీపీలో చంద్రబాబు తర్వాత నెంబర్ టు అనే లీడర్స్ ఇద్దరు ముగ్గురే ఉంటారు. అందులో ఒకరు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించి కోడెల గ్రాఫ్ పదేళ్ల నుంచి పడిపోతూనే ఉంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల గెలిచారు కానీ చాలా తక్కవు మెజారిటీ. ఈ నియోజకవర్గంలో అంబటి రాంబాబు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక కోడెల గెలిచిన తర్వాత ఆయన కుమారుడు - కుమార్తె ఆగడాలతో.. నియోజకవర్గంలో టీడీపీ నాయకులే అల్లాడిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో.. సత్తెనపల్లిలో కోడెలకు అసమ్మతి సెగ తగిలింది. అసలు కోడెలకు ఈసారి సీటు ఇస్తే దగ్గరుండి ఓడిస్తామని అక్కడి నాయకులు చంద్రబాబుకి డైరెక్ట్ గా చెప్పేశారు.
యాక్చువల్ గా అయితే కోడెలకు సీటు ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు. కానీ ఇవ్వక తప్పని పరిస్థితి. అందుకే అసంతృప్తుల్ని పిలిచి మరీ ఈ ఒక్కసారికి ఎలాగొలా సర్దుకొమ్మని చెప్పి పంపేశారు. సర్ది చెప్పి అయితే పంపారు కానీ కోడెల విజయంపై చంద్రబాబుకు నమ్మకం తక్కువే. అంతెందుకు పోటీ లోకి దిగుతున్న కోడెలకు కూడా నమ్మకం తక్కువుగానే ఉన్నట్లు ఉంది. కానీ బయటికి చెప్పుకోలేడు కాబట్టి.. ఈసారి తాను 15 వేల మెజారిటీతో గెలుస్తానని చెప్తున్నారు కోడెల. తన విజయం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు అని అన్నారు ఆయన. గత ఎన్నికల్లో అందరూ కలిసి పని చేసి తనను గెలిపించారని, ఈ ఎన్నికల్లోనూ అలాగే ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు సహజమని - బుధవారం జరిగిన సమావేశం గురించి కొద్ది మంది నేతలు మాట్లాడడం అనవసరం అని కోడెల చెప్పారు.
మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో ఏ మోస్తరు పాపులారిటీ ఉన్న నాయకుడి మినిమం మెజారిటీ 25 వేలు నుంచి 30 వేలుంది. కానీ కోడెల మాత్రం తాను 15 వేల మెజారిటీతో గెలుపొందుతానని చెప్తున్నారు. దీంతో.. ఆయనకు కూడా తన విజయంపై నమ్మకం లేదని అన్పిస్తుందని విమర్శిస్తున్నారు వైసీపీ శ్రేణులు.