ఏ మాత్రం ఇష్టం లేని ఉద్యోగాన్ని చేయటానికి ఇవాల్టి రోజుల్లో చాలామంది అస్సలు ఇష్టపడటం లేదు. పేరుకు పేరు.. కీర్తికి కీర్తి.. సంపదకు ఏ మాత్రం కొదవ లేని ఒక నేత.. తనకేమాత్రం నచ్చని పదవిని చేపట్టటానికి మించిన ఇబ్బందికర పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ పవర్ లోకి రావటంతో ఆయన చాలానే సంతోషించారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా తనకు మంత్రి పదవి దక్కటం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. కానీ.. చంద్రబాబు ఆలోచనలు అందుకు భిన్నంగా ఉండి.. ఆయన్ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలన్న విషయాన్ని ఆయనకు చెప్పినప్పుడు చాలా నిరాశకు గురైనట్లుగా చెబుతారు. అయితే.. అధినేత చెప్పిన మాటకు నో చెప్పలేక స్పీకర్ పదవికి ఓకే చెప్పినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
అసలేమాత్రం ఇష్టం లేని పదవికి తోడు.. సభలో చోటు చేసుకునే పరిణామాలు కోడెలకు ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ ఏకపక్ష ధోరణి.. ఆయన మొండితనం కోడెలకు చిరాకు తెప్పించటమే కాదు.. తనను చిన్నబుచ్చేలా మాట్లాడుతున్న వైఖరికి ఆయన తరచూ తీవ్ర అసహనానికి గురి అవుతున్న విషయం ఇట్టే అర్థమవుతుంది. కానీ స్పీకర్ ఛైర్లో కూర్చున్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలకు అతీతంగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో తనను తాను తీవ్రంగా కంట్రోల్ చేసుకోవటం అసెంబ్లీ లైవ్ ను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. తాను చెప్పే మాటల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగా జగన్ చేసే వ్యాఖ్యలపై ఆయన తన అసహనాన్ని అదిమిపెట్టుకున్న తీరు ఇట్టే అర్థమవుతుంటుంది.
తాజాగా అసెంబ్లీ సమావేశాలు షురూ అయిన నేపథ్యంలో విపక్ష సభ్యులతో ఆయన చెప్పిన మాటలు కాస్తంత ఆసక్తికరంగా ఉంటాయి. కాస్త చిరాకు.. అంతలోనే అనునయం.. విపక్ష సభ్యులను శాంతింపజేసి.. సభను సజావుగా నడిపేందుకు వీలుగా ప్రయత్నాలు చేయటం కనిపిస్తుంది. సోమవారం సభ ప్రారంభంలో వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఉద్దేశించి స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. ‘‘ప్లీజ్ కూర్చోండి. యూ విల్ బీ శాటిస్ ఫైడ్.. బీఏసీలో మీరే అంగీకరించారు. మీ తీర్మానంపై సమయం వచ్చినప్పుడు చెబతా. మీరు ఛైర్ ను డిక్టేట్ చేయలేరండీ.. ఇలా ఎలా వ్యవహరిస్తారు? బీఏసీలో ఒప్పుకొని ఇప్పుడేంటి ఇలా చేస్తున్నారు?’’ లాంటి మాటలు కోడెల నోటి నుంచి వినిపించాయి. విపక్ష నేతల నుంచి ఇలాంటి ఇబ్బందులు స్పీకర్ ఛైర్లో కూర్చున్న వారికి తప్పవనే చెప్పాలి.